దేశ రాజధాని ఢిల్లీలో కరెంటు కోతలు, దేశ రాజధానిలో మంచినీళ్ల కొరత.. ఈ ఎనిమిదేండ్లలో మీరు గొప్పగా చేసిందేమిటో చెప్పండి. దేశానికి తాగునీళ్లు ఇవ్వడానికి మీ దగ్గర సత్తా లేదు.. మంచిగ చేస్తున్న మాపై ఇష్టమున్నట్టు మాట్లాడుతరా? ఇదేనా మీ సంస్కారం. దేశంలో ఎన్నడూ లేనంత స్థాయికి నిరుద్యోగం పడిపోయింది. 8శాతం దాటుతుందా? ఏది సాధించారో చెప్పాలే, అరవడం పెడబొబ్బలు పెట్టడం కాదు.
పోయి పోయి హైదరాబాద్‌కే వచ్చారయ్యా. మీ బేజీపీ రాష్ట్రాల్లో తెలంగాణలో జరిగిన కనీసం 10శాతం డెవలప్ అయినా చూపిస్తరా? మీ అసమర్థత, పాలన సరిగా చాతకాక దేశాన్ని ఆగం పట్టించారు. మీకు ఇంకే చాతనైతదో చెప్పాలే, అడ్డం పొడుగు ఇష్టమన్నట్టు లొడ లొడ మాట్లాడుతే అయిపోద్దా. ఇక్కడికొచ్చి మా ప్రభుత్వాన్ని తిట్టిపోతరా? ఇదేనా మీ సంస్కారం, నేషనల్ పర్ క్యాప్టా ఎంతనండీ, తెలంగాణ పర్ క్యాప్టా ఎంత? అని సీఎం కేసీఆర్ బీజేపీని ప్రశ్నించారు.