Saturday, November 23, 2024

మ‌రువ‌లేని నేత‌లు ఇద్ద‌రే – ఎన్టీఆర్ – కేసీఆర్ – మంత్రి కేటీఆర్

మంత్రి కేటీఆర్ నోట ఎన్టీఆర్ పేరు వినిపించింది. టిఆర్ ఎస్ 21వ ఆవిర్భావ దినోత్స‌వ వేడుక‌గా ప్లీన‌రీ జ‌రుగుతోంది. కాగా ఈ ప్లీన‌రీ వేదిక‌పై పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ టీడీపీ వ్య‌వ‌స్థాప‌కుడు నంద‌మూరి తార‌క‌రామారావుని గుర్తు చేసుకున్నారు. . ఎన్టీఆర్‌తో కేసీఆర్‌ను పోలుస్తూ కేటీఆర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. దేశ రాజ‌కీయాల్లో ఎన్టీఆర్ హిస్ట‌రీ క్రియేట్ చేశార‌న్న కేటీఆర్‌… తెలంగాణ ఉద్య‌మం, తెలంగాణ‌ను ప్ర‌త్యేక రాష్ట్రంగా సాధించిన కేసీఆర్ హిస్ట‌రీతో పాటు జాగ్ర‌ఫీ కూడా క్రియేట్ చేశార‌న్నారు. మ‌రువ‌లేని నేత‌లు ఇద్ద‌రు మాత్ర‌మే. ఒక‌రు ఎన్టీఆర్ అయితే… మరొక‌రు కేసీఆర్‌. ఎన్టీఆర్ హిస్ట‌రీ క్రియేట్ చేశారు. కేసీఆర్ హిస్ట‌రీతో పాటు జాగ్ర‌ఫీ కూడా క్రియేట్ చేశారు. ప్ర‌తి రాష్ట్రానికి ముఖ్య‌మంత్రి ఉంటారు. కానీ మ‌న ద‌గ్గ‌ర రాష్ట్రాన్ని సాదించిన నేత సీఎంగా ఉన్నారు. కేసీఆర్ జ‌న్మ ధ‌న్య‌మైంద‌ని ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీనే అన్నారు. రైతు బంధు దేశానికే దిక్చూచీ అయ్యింది. దేశానికి తెలంగాణ త‌ర‌హా అభివృద్ధి కావాలి. థ్యాంక్స్ టూ సీఎం కేసీఆర్” అంటూ కేటీఆర్ ఆసక్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఇది NDA ప్రభుత్వం కాదు- NPA ప్రభుత్వం. NPA అంటే నాన్ పర్ఫామింగ్ అసెట్స్ అనాలి అని ఎద్దేవా చేశారు. మతాల పేరుతో కొట్లాడాలి అని ఏ దేవుడు చెప్పిండు..మేరా భారత్ మహాన్ అనే నాయకుడు దేశానికి కావాలి- ఆ నాయకుని తెలంగాణ అందిస్తుందేమో అని అన్నారు మంత్రి కేటీఆర్. ఉద్వేగాల దేశం కాదు- ఉద్యోగాల దేశం కావాలి.కేసీఆర్ లాంటి టార్చ్ బేరర్ దేశానికి అవసరం అని అన్నారు.దేశానికి ఒక విజనరీ కావాలి టేలివిజనరి కాదు.భారత దేశానికి కేసీఆర్ లాంటి నాయకుడు కావాలన్నారు.మతపిచ్చి- కులపిచ్చి లేకుండా తెలంగాణకు గోల్డెన్ పాలన కేసీఆర్ అందిస్తున్నారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement