డబ్బు ఎవరిని ఏమైనా చేస్తుంది. స్నేహాలను కలుపుతుంది. విడగొడుతుంది.. అలాగే అన్నదమ్ముల మధ్య కూడా చిచ్చు పెడుతోంది. అలాగే అన్నదమ్ముల మధ్య డబ్బుల విషయంలో వివాదం చోటుచేసుకొని అన్నను తమ్ముడు కొట్టిచంపిన ఘటన తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని కామారెడ్డి పాత బస్టాండ్ దగ్గర ఈ ఘటన జరిగింది. సాదిక్ అనే వ్యక్తిని తన తమ్ముడు రాళ్లతో కొట్టి చంపాడు. డబ్బుల విషయంలో అన్నదమ్ముల మధ్య వివాదం చోటుచేసుకుంది. ఈ వివాదం కాస్త పెరిగిన ఘర్షణకు దారితీయడంతో తమ్ముడు అన్న సాదిక్ ను హత్య చేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -