భద్రాచలం, (ప్రభ న్యూస్): భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 71 అడుగులకు చేరింది. 1990లో 70.8 అడుగులగా నమోదు కాగా ఇప్పుడు అంత కన్న ఎక్కువగా 71 అడుగులుగా నమోదు అయ్యింది. ఇది ఇలా ఉండగా సాయంత్రం నుంచి గోదావరి పెరుగుదల కొంచెం కొంచెంగా ఉంది. దిగువకు చేరుతున్న వరద ఉదృతి కూడా నెమ్మదిగా తగ్గుతుంది. మరో వైపు భద్రాచలాన్ని ఆనుకుని ఉన్న ఏటపాక శివారులో కరకట్ట మీద నుంచి నీరు పారుతుందన్న వదంతులు వ్యాప్తి చెందాయి. దీంతో భద్రాచలం పట్టణంలో భయాందోళన నెలకొంది. శుక్రవారం రాత్రి గోదావరి ఉధృతి పరిస్థితి నిలకడగా ఉంటే పరవాలేదు.. కానీ, మరింత పెరిగితే ఇబ్బందులు తప్పవంటున్నారు స్థానికులు.
Breaking: 71 అడుగులకు చేరిన గోదావరి నీటి మట్ట.. మరింత పెరిగే చాన్స్ ఉందన్న అధికారులు
Advertisement
తాజా వార్తలు
Advertisement