Friday, November 22, 2024

The Truth – లూప్ లైన్ క్రాసింగ్ క్లోజ్ కాక‌పోవ‌డంతోనే పెను ప్ర‌మాదం – ‘రైల్‌ ట్రాఫిక్‌ ఛార్ట్‌’ వెల్లడి

భువనేశ్వర్‌: ఒడిశాలోని బాలేశ్వర్‌ జిల్లాలో శుక్రవారం రాత్రి జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ఇప్పటివరకు 300 మందికి పైగా మృతి చెందగా.. 1000 మందికి పైగా క్షతగాత్రుల‌య్యారు… కాగా, ప్రమాదం జరగడానికి కొన్ని క్షణాల ముందు ఏం జరిగిందో తెలియజేసే ‘రైల్‌ ట్రాఫిక్‌ ఛార్ట్‌’ తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ చార్ట్ ను రైల్వేశాఖ విడుద‌ల చేసింది.. కోర‌మండ‌ల్ వెళ్తున్న‌మెయిన్ లైన్ లో లూప్ లైన్ క్రాసింగ్ ఉండ‌గా, ఆ క్రాసింగ్ జంక్ష‌న్ క్లోజ్ కాక‌పోవ‌డం వ‌ల్లే కోర‌మండ‌ల్ లూప్ లైన్ లో ఉన్న గూడ్స్ ను ఢీకొంద‌ని ఈ చార్ట్ తేట‌తెల్లం చేస్తున్న‌ది.

కాగా , ‘రైల్‌ ట్రాఫిక్‌ ఛార్ట్‌’ రైలు ట్రాఫిక్‌ను ట్రాక్‌ చేసేందుకు ఈ వ్యవస్థ ఉపకరిస్తుంది. రైల్వే ట్రాఫిక్‌ అధికారులు ఈ లేఅవుట్‌ను విడుదల చేశారు. దీని ప్రకారం కచ్చితంగా ఏ ప్రదేశంలో ప్రమాదం జరిగిందో గుర్తించేందుకు వీలుంటుంది. ఈ చిత్రాన్ని ఓ సారి పరిశీలిస్తే.. మూడు రైల్వే లైన్లు వరుసగా ఉన్నాయి. అందులో మధ్యలైన్‌ ‘యూపీ మెయిన్‌’. ఇందులోనే షాలిమార్‌ నుంచి చెన్నై వెళ్తున్న కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రయాణించినట్లు రైల్వే వర్గాలు చెబుతున్నాయి. దానికి కుడివైపున ఉన్న లైన్‌ ‘ డీఎన్‌ మెయిన్‌’. బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ ఈ లైన్‌లోనే వెళ్లింది. అయితే, యూపీ మెయిన్‌లైన్‌లో వెళ్తున్న కోరమాండల్‌ అక్కడ క్రాసింగ్‌ పాయింట్‌ ఉండటంతో పొరపాటున కామన్‌ లూప్‌లోకి వచ్చేసింది. దీంతో అప్పటికే ఆ లైన్‌లో నిలిపి ఉన్న గూడ్స్‌ రైలును బలంగా ఢీ కొట్టింది. ఈ హఠాత్పరిణామంతో కోరమాండల్‌లోని కొన్ని బోగీలు పట్టాలు తప్పి పక్కనే ఉన్న ‘డీఎన్‌ మెయిన్‌ లైన్‌’లోకి ఎగిరిపడ్డాయి. అదే సమయంలో వేగంగా క్రాస్‌ అవుతున్న బెంగళూరు-హౌరా యశ్వంతపూర్ ఎక్స్‌ప్రెస్‌ రైలు వాటిని ఢీ కొట్టడంతో ప్రమాద తీవ్రత భారీగా పెరిగిపోయింది. అయితే కోర‌మండ‌ల్ మెయిన్ లైన్ లో గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డంతో అది త‌న మార్గంలో నిర్ణీత 118 కిలో మీట‌ర్ల వేగంతో ప్ర‌యాణం కొన‌సాగిస్తున్న‌ది.. ఆకస్మికంగా దానికి ఇచ్చిన గ్రీన్ సిగ్నల్ మారి రెడ్ సిగ్నల్ పడింది.. దీంతో లూప్ క్రాసింగ్ పాయింట్ మెయిన్ లైన్ తో క‌ల‌వ‌క‌పోవ‌డంతో వేగంగా గూడ్స్ ఉన్న రైల్వే లైన్ లోకి దూసుకువ‌చ్చి దానిని ఢీకొట్టింది.. తాజాగా క్రాసింగ్ పాయింట్ ఎందుకు క్లోజ్ కాలేద‌ని దానిపై ఇప్పుడు అధికారులు విచార‌ణ చేప‌ట్టారు.. గ్రీన్ సిగ్న‌ల్ , రెడ్ సిగ్నల్ మార్పు వల్లే లూప్ క్రాసింగ్ క్లోజ్ అవ్వ‌లేద‌నే విష‌యం పైనే ఇప్పుడు అంద‌రూ దృష్టి పెట్టారు..

ఇది ఇలా ఉంటే మెయిన్‌లైన్‌లో వెళ్తున్న ఎక్స్‌ప్రెస్‌, సూపర్‌ఫాస్ట్‌ రైళ్లకు మార్గం సుగమం చేసేందుకు కొన్ని సందర్భాల్లో ప్యాసింజర్‌, గూడ్స్‌ రైళ్లను ట్రాఫిక్‌ అధికారులు లూప్ లైన్‌లోకి పంపిస్తారు. కొద్దిసేపటి తర్వాత, సిగ్నల్‌ క్లియరెన్స్‌ను బట్టి మళ్లీ వాటిని మెయిన్‌లైన్‌లోకి అనుమతిస్తారు. మరోవైపు ఈ ఘోర ప్రమాదంపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement