Tuesday, November 26, 2024

పెట్రోల్ ట్యాంక్ ని ఢీ కొన్న రైలు..ట్యాంకర్ తో పాటు పలు ఇళ్లు దగ్థం

పెట్రోల్ ట్యాంకర్ ని ఢీ కొంది రైలు. దాంతో భారీగా మంటలు చెలరేగాయి. ఈ సంఘటన మెక్సికోలో చోటు చేసుకుంది. ఇంధన ట్యాంకర్  ట్రక్కు రైలు మార్గం దాటుతుండగా వేగంగా వచ్చిన రైలు ఢీకొట్టింది. దాంతో అసలే పెట్రోల్ తో ఉన్న ట్యాంక్ పేలిపోయింది. భారీగా మంటలు చెలరేగాయి. ట్రక్కు మొత్తం మంటల్లో కాలిపోయింది. దట్టమైన పొగలు ఆ ప్రాంతం మొత్తాన్ని కప్పేశాయి. ఈ ప్రమాదంలో పక్కన ఉన్న ఇళ్లు కూడా కాలిపోయాయి. ప్రాణభయంతో ప్రజలు పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిసింది..మెక్సికో దేశంలో అగ్వాస్కాలియెంటెస్ నగరంలోని రైలు మార్గం వద్ద ఇంధన ట్యాంకర్ రైలు మార్గం దాటుతుండగా వేగంగా వచ్చిన రైలు ఢీకొట్టింది.

ట్రక్కు పాస్ అవుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంతో రైలు ఢీకొట్టగానే ఇంధనం అంటుకొని భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. నివాస ప్రాంతాలకు మంటలు అంటుకున్నాయి. మంటల్లో చిక్కుకున్న 12 మందిని ఫైర్ సిబ్బంది రక్షించారు. ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు.వెంటనే స్థానికులు అలెర్ట్ అయ్యి పరుగులు తీశారు. ఇక రెస్క్యూ టీం రంగంలోకి దిగి 800 నుంచి 1000 మందిని ఇళ్లలోంచి ఖాళీ చేయించినట్టు అగ్వాస్కాలియెంటెస్ అధికారులు తెలిపారు. దట్టమైన పొగల కారణంగా ఒక వ్యక్తి స్వల్ప అస్వస్థతకు గురయ్యాడు. ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేశాడు.ఇక ఈ ట్రక్కు డ్రైవర్ ఈ ప్రమాదంలో మరణించినట్టుగా తెలుస్తోంది. ట్రక్కు పేలిపోయి మంటలు చెలరేగడంతో అతడు బతికే ఛాన్స్ ఉందా? లేదా? తెలియడం లేదు. ప్రమాదం జరగగానే తప్పించుకొని పారిపోయాడా? అన్నది కూడా పోలీసులు నిర్ధారించడం లేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

https://twitter.com/DredreBabb/status/1583256342663688192



Advertisement

తాజా వార్తలు

Advertisement