Thursday, November 21, 2024

Odisha : రైలు ప్ర‌మాద ఘ‌ట‌న తీవ్రంగా క‌లచివేసింది.. ప్ర‌ధాని మోడీ.. రాష్ట్ర‌ప‌తి

ఒడిశాలో ఘోర రైలు ప్ర‌మాదం జ‌రిగింది.కాగా ఈ ప్ర‌మాద ఘ‌ట‌న‌పై పరిస్థితిని సమీక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ సమావేశమయ్యారు. ఈ ప్రమాదంపై ప్రధాని మోడీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దిగ్భ్రాంతి ప్రకటించారు. కాగా నేడు రాష్ట్ర వేడుకలను రద్దు చేసిన ఒడిశా సర్కార్ ..ఒక రోజు సంతాప దినంగా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రైల్వే శాఖ రూ. 10 లక్షల పరిహారం ప్రకటించింది. హౌరా నుంచి చెన్నై వెళ్తున్న కోరమండల్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదానికి గురవడంపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తో ప్రధాని మోడీ ఫోన్ లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. నా ఆలోచనలు బాధితుల గురించి. వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు.

మెరుగైన వైద్య సేవలు అందిస్తామని మోడీ ట్వీట్ చేశారు.ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో కొందరు ప్రాణాలు కోల్పోవడం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాడ సానుభూతి తెలిపారు. సహాయక చర్యలు విజయవంతం చేయాలని, గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ట్వీట్ చేశారు.ఒడిశాలో జరిగిన రైలు ప్రమాద ఘటన తీవ్ర విషాదం నింపింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. రైల్వే అధికారులు, ఆర్మీ సైన్యం సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement