Tuesday, November 26, 2024

నోటీసులిచ్చినా ప‌ట్టించుకుంట‌లేరు, కోర్టు ఆదేశాల‌ను ఆ ముగ్గురు బేఖాత‌రు చేస్తున్న‌రు: హైకోర్టుకు సిట్​

ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన ఫాం హౌస్ కేసులో సిట్ విచారణకు నిందితులు బీఎల్ సంతోష్‌, తుషార్‌, జ‌గ్గుస్వామి హాజరుకాక పోవడంపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఇవ్వాల (మంగ‌ళ‌వారం) హైకోర్టును ఆశ్రయించింది. కేసు విచారణలో భాగంగా ముగ్గురు నిందితులకు నోటీసులు జారీ చేసినా వారు రాలేదని కోర్టుకు సిట్‌ విన్నవించింది. త‌మ నోటీసులను వారు బేఖాతరు చేస్తున్నందున హైకోర్టు ఆర్డర్ ఇవ్వాలని అధికారులు ధర్మాసనాన్ని కోరారు. బీఎల్ సంతోష్ కు నోటీసులు అందజేసినట్లు ఢిల్లీ పోలీసులు చెప్పగా, ఈ విషయాన్ని అసిస్టెంట్ సోలిసిటర్ జనరల్ కోర్టు దృష్టికి తెచ్చారు.

ఇక‌.. సిట్ పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం అరెస్ట్ ప్రొటెక్షన్ ఉండదని స్పష్టం చేసింది. ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత కూడా ఎందుకు హాజరుకావడం లేదని నిందితుల తరఫు లాయర్ ను ప్రశ్నించింది. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ఉన్నందున విచారణకు హాజరుకాలేక పోతున్నారని బీఎల్ సంతోష్ తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు, సిట్ విచారణ తదితర అంశాలను బుధవారం ఉదయం 10 :30 గంటలకు మరోసారి పరిశీలిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. కేసు తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement