హైదరాబాద్, ఆంధ్రప్రభ: రేపటి నుంచి టెట్ హాల్‌టికెట్లు జారీ చేయనున్నారు. టెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. టెట్ పరీక్ష జూన్12న మొత్తం 33 జిల్లాల్లో జరగనుంది. పేపర్-1, పేపర్-2 రెండు పరీక్షలు ఒకే రోజు జరగనున్నాయి. పేపర్-1 ఉదయం 9.30 గంటల నుంచి 12 గంటల వరకు, పేపర్2 పరీక్ష మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. ఇదిలా
ఒకే రోజు రెండు పరీక్షలు…
జూన్ 12న టెట్, ఆర్‌ఆర్‌బీ పరీక్షలు రెండూ ఒకే రోజు ఉండడంతో అభ్యర్థులు ఏదిరాయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. టెట్ రాసే అభ్యర్థుల్లో దాదాపు 5 వేల నుంచి 10వేల మధ్యలో ఆర్‌ఆర్‌బీ పరీక్షను కూడా రాస్తున్నవారు ఉన్నారు. పైగా ఆర్‌ఆర్‌బీ పరీక్ష సెంటర్ మహారాష్ట్రలోనే పడింది. ఈ పరీక్షను రాయదల్చుకునేవారు రెండు రోజుల ముందే అక్కడికి చేరుకోవల్సి ఉంటుంది. ఒకే రోజు రెండు పరీక్షలు ఉండడంతో ఏదైనా ఒక పరీక్షను వదులుకోక తప్పని పరిస్థితి. గత టెట్‌లో స్కోర్ బాగా చేసినవారు ఆర్‌ఆర్‌బీ రాసేందుకు వెళ్తుంటే… స్కోర్ చేయని వారు కొందరు టెట్ రాసేందుకే సిద్ధపడుతున్నట్లు అభ్యర్థులు చెప్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.