దేశంలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై 4,984 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని సుప్రీం కోర్టు తెలిపింది. ఈ సంఖ్య డిసెంబర్ 1, 2021 నాటి వరకే అని వివరించింది. అమికస్ క్యూరీ డేటా ప్రకారం.. ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్న ఈ కేసులను వెంటనే ముగించేలా.. ఫాస్ట్ ట్రాక్ చేసేందుకు ప్రత్యేక కోర్టులు అవసరమని సుప్రీం తెలిపింది. గత మూడేళ్లలో.. 862 కేసులు పెరిగాయి. 1,899 కేసులు.. ఐదేళ్ల కంటే ఎక్కువ నుంచి పెండింగ్‌లో ఉన్నాయి. సీనియర్ అడ్వకేట్ విజయ్ హనసరియా కీలక విషయాలు వెల్లడించారు. డిసెంబర్, 2018 వరకు ఎంపీలు, ఎమ్మెల్యేలపై 4,110 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. అక్టోబర్ 2020 వరకు 4,859 ఉన్నాయి. 4.12.2018… 2,775 కేసులు పరిష్కరించిన తరువాత కూడా.. రాజకీయ నేతలపై కేసులు 4,122 కేసుల నుంచి 4,984కు పెరిగాయి. నేర చరిత్ర కలిగిన ఎక్కువ మంది నేతలు పార్లమెంట్, రాష్ట్ర శాసన సభల్లో కూర్చుకుంటున్నారని ఈ రిపోర్టు నిరూపిస్తున్నది.
త్వరిగతిన పరిష్కారం అవసరం…
పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ కేసులను త్వరితగతిన పరిష్కరించడానికి తక్షణ, కఠినమైన చర్యలు తీసుకోవడం చాలా అవసరమని న్యాయవాది విజయ్ అభిప్రాయపడ్డారు. హైకోర్టులు దాఖలు చేసిన స్టేటస్ రిపోర్టు కూడా కొన్ని రాష్ట్రాల్లో ప్రత్యేక కోర్టులు ఏర్పాటయ్యాయని తెలిపారు. అయితే ఇతర రాష్ట్రాల్లో, సంబంధిత న్యాయ పరిధుల న్యాయ స్థానాలు కాలానికి అనుగుణంగా జారీ చేసిన ఆదేశాలపరంగా విచారణలు నిర్వహిస్తున్నాయన్నారు. ఈ అధికార పరిధి న్యాయస్థానాలు ఎంపీలు/ఎమ్మెల్యేలపై ఉన్న కేసుల విచారణతో పాటు వారికి కేటాయించిన ఇతర రోస్టర్లను విడుదల చేస్తాయి. అనేక రాష్ట్రాల్లో.. ఎస్‌సీ/ఎస్‌టీ చట్టం, పోక్సో చట్టం మొదలైన చట్టాల ప్రకారం.. ప్రత్యేక న్యాయ స్థానాలు ఉన్నాయి. ఎంపీలు/ఎమ్మెల్యేలపై ఉన్న కేసులను విచారించే కోర్టులు.. ప్రత్యేకంగా ఈ కేసులను విచారిస్తాయి. ఇతర కేసుల విచారణ మగిసిన తరువాతే ఈ కేసులు తీసుకుంటున్నారు. ఈ జాప్యాన్ని నివారించడానికి తగు చర్యలు తీసుకోవాలని న్యాయవాది విజయ్ కోరుతున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..,