ఎండలు దంచికొడుతున్నయ్.. మధ్యాహ్నం వేళ ఇంట్లో నుంచి బయట అడుగుపెట్టాలంటేనే భయపడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఇక, పలు నగరాలు, పట్టణాల్లో డెవలప్‌మెంట్, బడా బల్డింగుల నిర్మాణంతో చెట్లను కొట్టేసే పరిస్థితి కనిపిస్తోంది.. అయితే తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారం కొంత బెటర్‌మెంట్ అయినా.. కాంక్రీట్ జంగిల్ వంటి హైదరాబాద్ సిటీలో మాత్రం పక్షలకు ఇబ్బంది తప్పట్లే. అట్లానే రంగారెడ్డి జిల్లాలోని పలు పట్టణాలు, గ్రామాల్లోనూ పక్షులను సంరక్షించే చర్యలు తీసుకుందాం. ఈ ఎండాకాలంలో వాటికి కాసిన్ని నీళ్లు అందించి దాహం తీరుద్దాం.. మనుషులుగా మనలోని మానవత్వాన్ని చాటుకుందాం అని టీఆర్ ఎస్ ఎంపీ రంజిత్‌రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్‌లో ఈ సందేశాన్ని పోస్టు చేశారు.
ఎండలు మండుతున్నయ్.. పక్షుల దాహం తీరుద్దాం: ఎంపీ రంజిత్‌రెడ్డి
Advertisement
తాజా వార్తలు
Advertisement