Tuesday, November 19, 2024

Spl Story | స్కెచ్ అంటే ఇట్లుండాలే.. చనిపోయి 20ఏళ్లు, మూడు మర్డర్ల కేసులో తాజాగా అరెస్టు!

మర్డర్ కేసు నుంచి బయటపడడానికి ఓ 40 ఏళ్ల వ్యక్తి ఏకంగా తన ఐడెంటిటీనే మర్చేసుకున్నాడు. అంతేకాకుండా మరో ఇద్దరిని చంపేసి, అందులో తాను కూడా చనిపోయినట్టు అందరినీ నమ్మించాడు. ఇట్లా 20 ఏళ్లుగా బయట జనాలకు తెలియకుండా గుర్తింపును మార్చేసుకుకుని ఫ్యామిలీతో హ్యాపీగా గడిపాడు. కానీ, 60 ఏళ్ల తర్వాత పోలీసులకు అడ్డంగా బుక్కయ్యాడు. ఈ ఘటన హర్యానా​లో జరిగింది. అయితే చనిపోయినట్టు నటించిన వ్యక్తి నేవీలో పనిచేసిన వాడు కావడం ఇక్కడ గమనార్హం.

– వెబ్​ డెస్క్​, ఆంధ్రప్రభ

పోలీసుల రికార్డుల్లో 20 ఏళ్ల క్రితమే ఆ వ్యక్తి మరణించాడు. మర్డర్ కేసులో ప్రధాన నిందితుడు మరణించాడని రాజస్తాన్ పోలీసులు కేసును మూసేశారు. అంతా ముగిసిపోయిందని అనుకున్నారు. కానీ, ఆ వ్యక్తి వేసిన స్కెచ‌తో దిమ్మదిరిగిపోయింది. చదివింది ఎనిమిదో తరగతే కానీ, ఆయన అతితెలివి ఊహించలేనిది. మర్డర్ల కేసులో నుంచి తప్పించుకోవడమే కాకుండా, కుటుంబంతో ప్రశాంతంగా మళ్లీ తన జీవితాన్ని ప్రారంభించాడు.  హర్యానాలోని పానిపట్‌కు చెందిన బాలేశ్ కుమార్ ఎనిమిదో తరగతి చదువుకున్నాడు. 1981లో ఇండియన్ నేవీలో స్టీవార్డ్ గా చేరాడు. 1996 వరకు సేవలు అందించాడు. రిటైర్‌మెంట్ తర్వాత ఢిల్లీలోని ఉత్తమ్ నగర్‌లో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నాడు.

ప్రస్తుతం 60 ఏండ్ల వయస్సున్న బాలేశ్ కుమార్ 40 ఏళ్ల వయసులో ఓ క్రైమ్​ చేశాడు. తన బావమరిది అయిన రాజేశ్ అలియాస్ ఖుషీరామ్‌ను 2004లో డబ్బు సంబంధ వివాదంలో ఢిల్లీలోని బావనలో హతమార్చాడు. రాజేశ్ భార్యతో బాలేశ్‌కు వివాహేతర సంబంధం ఉన్నట్టు ఆరోపణలున్నాయి. ట్రాన్స్ పోర్టు వ్యాపారంలో ఉన్న బాలేశ్ కుమార్ ఈ హత్య అనంతరం ట్రక్కులో రాజస్తాన్‌కు పారిపోయాడు. అక్కడే ట్రక్కుకు నిప్పు పెట్టాడు. వెంటవచ్చిన ఇద్దరు లేబర్లను కూడా తగులబెట్టి చంపేశాడు.

- Advertisement -

కాగా, పోలీసులు స్పాట్‌కు వచ్చి పరిశీలించారు. మరణించిన ఇద్దరు లేబర్లలో ఒకరిని బాలేశ్ కుమార్‌గా పొరబడ్డారు. ఆయన కుటుంబం కూడా బాలేశ్‌గానే పేర్కొంది. దీంతో మర్డర్ కేసులో ప్రధాన నిందితుడు మరణించాడని రాజేశ్​ మర్డర్​ కేసును క్లోజ్​ చేసేశారు.

కానీ.. బాలేశ్ మాత్రం అక్కడి నుంచి పంజాబ్‌కు పారిపోయాడు. అక్కడ కుటుంబ సభ్యుల సహకారంతో ఒక నకిలీ ఐడెండిటీ సంపాదించుకున్నాడు. అమన్ సింగ్‌గా కొత్త అవతారమెత్తాడు. ఆయన కుటుంబంతో పాటు, భార్యతోనూ టచ్‌లోనే ఉన్నాడు. నేవీ నుంచి ఇన్సూరెన్స్ క్లెయిమ్, పింఛన్​ వంటివన్నీ తన భార్య పొందేలా చూశాడు. తన సోదరుడు మహిందర్ సింగ్ పేరు మీద రిజిస్టర్ అయిన ట్రక్కుకు కూడా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుని భార్యకు అందేలా చేశాడు.. ఇవన్నీ ఈ మధ్య పోలీసులు జరిపిన ఎంక్వైరీలో బయటపడ్డాయి.  ఆ తర్వాత బాలేశ్ ఢిల్లీలోని నజఫ్‌గడ్‌కు వెళ్లి కుటుంబంతో కలిసి జీవించాడు. ప్రస్తుతం ప్రాపర్టీ డీలర్‌గా పని చేస్తూ తన జీవితాన్ని ఎంజాయ్​ చేస్తున్నాడు.

అయితే.. బాలేశ్ గురించి ఢిల్లీ పోలీసులకు సమాచారం అందడంతో అతడిని అరెస్టు చేసి రాజస్తాన్ పోలీసులు సమాచారం అందించారు. ట్రక్కు దగ్ధం కేసు రీ ఓపెన్​ చేయాలని సూచించారు. ఈ కేసులో నేరాలను తానే చేసినట్టు బాలేశ్ చివరికి ఒప్పుకున్నాడు రాజేశ్ హత్య కేసులో బాలేశ్ సోదరుడి ప్రమేయం కూడా ఉండి ఉంటుందని విచారణ చేపట్టిన పోలీసులు అంచనా వేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement