Friday, November 22, 2024

Spl Story: చిప్పు దొబ్బింది, బిజినెస్​పై వార్​ ఎఫెక్ట్​.. కొత్త బండి కొనాలంటే ఏడాది ఆగాల్సిందే!​

రష్యా, ఉక్రెయిన్​ వార్​ ఎంతగా ప్రపంచ దేశాలను ఎఫ్టెక్ట్​ చేస్తుందంటే.. ఆ రెండు దేశాల మీద ఆధారపడి ఉన్న ప్రతి ఇండస్ట్రీ మీద చాలా ఎఫెక్ట్​ పడుతోంది. ఎక్కువగా ఇబ్బంది పడుతున్న వాటిలో మోటారు వాహనాల ఇండస్ట్రీ ఉండగా.. ఆ తర్వాత న్యూస్​ పేపర్​ ఇండస్ట్రీ ఉంది. ఇందులో మీడియా రంగంలోని పలు సంస్థలు న్యూస్​ ప్రింట్​ ఇంపోర్ట్​ కాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాగా, కొత్త వాహనాలు కొనేవారు అవి అనుకున్న టైమ్​కు డెలివరీ అందక  పెదవి విరుస్తున్నారు.

‌– డిజిటల్​ మీడియా విభాగం, ఆంధ్రప్రభ

2019నుంచి కరోనా వైరస్​ నేపథ్యంలో అన్ని రంగాలు దెబ్బతిన్నాయి. ఆ తర్వాత కొన్ని వ్యవస్థలు మెల్లమెల్లగా కోలుకుంటున్నప్పటికీ.. మీడియా రంగం మాత్రం చాలా కఠినమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఎంతోమంది మీడియా సిబ్బంది వైరస్​ బారిన పడి చనిపోవడం.. ఆ తర్వాత ఎంతో పేరుగాంచిన మీడియా సంస్థలు ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలే సిబ్బందిని తగ్గించుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. అంతేకాకుండా కొన్ని మీడియా సంస్థలు అయితే వాటి ప్రింటింగ్​ యూనిట్లను కూడా మూసివేసి తక్కువ మ్యాన్​పవర్​, కొద్దిపాటి సర్య్కులేషన్​తో రన్​ చేయడం ప్రారంభించాయి. ఇక.. వార్​ ఎఫెక్ట్​ కూడా మీడియా రంగంపై చాలా పెద్ద ఎత్తున ప్రభావాన్ని చూపింది. వార్​కి ముందు వరకు న్యూస్​ ప్రింట్​ రేట్​ టన్నుకు (2021 డిసెంబర్​లో) దాదాపు700 నుంచి 750 డాలర్లుగా ఉండేది. ఆ తర్వాత 1000డాలర్లకు (78,936)లకు పెరిగింది. ఇది కాస్త ఇప్పుడు 12 నుంచి 13వేల డాలర్లకు టన్ను చొప్పున లభిస్తోంది.  

కొవిడ్ ప్రభావం న్యూస్‌ప్రింట్ దిగుమతికి అంతరాయం కలిగించగా.. ఆ తర్వాత రష్యా, ఉక్రెయిన్ యుద్ధం వంటి అనేక అంశాలు పేపర్​ కొరతకు దారితీశాయి. న్యూస్‌ప్రింట్‌ను కెనడా, యునైటెడ్ స్టేట్స్, కొరియా, రష్యాతో సహా అనేక దేశాలు ఉత్పత్తి చేస్తున్నాయి. అయితే యుద్ధంవల్ల దిగుమతులు లేక వార్తాపత్రికల సప్లయ్​పై చాలా ప్రభావం పడింది. 

ఇక.. మోటారు వాహన రంగాన్ని పరిశీలిస్తే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి వాహన తయారీకి ఎలక్ట్రానిక్స్​ చిప్స్ అవసరం ఎంతో ఉంది. కానీ, రష్యా, ఉక్రెయిన్​ యుద్ధంతో టెక్నాలజీ పరంగా ఉపయోగించే ఎట్లాంటి చిప్స్​ కూడా అందుబాటులో లేకుండా పోయాయి. దీంతో చేతిలో డబ్బులున్నా వెంటనే మనుసుకు నచ్చిన వాహనం కొనే పరిస్థితి లేదు. దీనికి వెహికల్​ డెలివరీలు ఆలస్యం కావడమే ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో లేటెస్ట్​ మోడల్​ మహీంద్రా ఎక్స్​యూవీ 700 మోడల్​ బండి కొనాలంటే ఏడాది కాలం వెయిట్​ చేయాల్సిన పరిస్థితులున్నాయి. అదేవిధంగా మారుతీ ఎర్టిగా కొనాలన్నా దాదాపు తొమ్మిది నుంచి 11 నెలల పాటు ఆగాల్సి వస్తోంది. చిప్​ల కొరతతో సహా ప్రపంచ వ్యాప్తంగా ఏర్పడ్డ సప్లయ్​ చైన్లలో ఇబ్బందుల కారణంగా కార్ల కొనుగోలుదారులు ఇబ్బందులు పడుతున్నారు. కరోనాకు తోడు రష్యా, ఉక్రెయిన్​ యుద్ధంతో చిప్​ల తయారీ, సరఫరా మరింత దెబ్బతిన్నది. వీటితో పాటు సెమీ కండక్టర్ల  కొరత కూడా ఇంకొంత కాలం ఇట్లానే ఉండే పరిస్థితి ఉందని సొసైటీ ఆఫ్​ ఇండియన్​ ఆటోమొబైల్​ మాన్యుఫ్యాక్చరర్స్​ (సియామ్​) డైరెక్టర్​ జనరల్​ రాజేశ్​ మీనన్​ అంటున్నారు..

- Advertisement -

ప్రీమియం వెహికల్స్,​ కాంపాక్ట్​ ఎస్​యూవీ విభాగంలో వెహికల్స్​ డెలివరీ ఇంకా ఆలస్యం అవుతోంది. ఫెడరల్​ ఆఫ్​ ఆటోమొబైల్​ డీలర్స్​ అసోసియేషన్​ (ఫాడా) తెలిపిన వివరాల ప్రకారం.. ఎక్స్​యూవీ 700తోపాటు హ్యుందయ్​ క్రెటా, వెన్యూ (న్యూ వెర్షన్​), మారుతి సుజుకి ఎర్టిగా, మహీంద్రా థార్​, వెన్యూ వంటి బెస్ట్​ సెల్లర్​ మోడల్​ వేహికల్స్​ కనీసం ఆరు నుంచి తొమ్మిది నెలల పాటు వెయిట్​ చేయాల్సిందే. అయితే.. హ్యుందయ్​ గ్రాండ్​ ఐ10 నియోస్​ లేదా, శాంత్రో, మారుతి సుజుకి సెలేరియో, లేదా వ్యాగనార్​, టాటా టిగోర్​ వంటి హ్యాచ్​బ్యాక్​ / సెడాన్​ వంటి బండ్లు డెలివరీకి మాత్రం ఒకటి రెండు నెలల టైమ్​ పడుతోంది.

ఇక.. చిప్​ల కొరత ఇప్పుడప్పుడే తీరేలా లేదని అంటున్నారు ఆటోమొబైల్​ రంగ మార్కెట్​ అనలిస్టులు. దాదాపు 2023వ సంవత్సరా దాకా ఇట్లాంటి పరిస్థితులే ఉంటాయంటున్నారు. కాగా వెయింటింగ్​ లిస్ట్​లో టాప్​ మోడల్స్​ కూడా ఉన్నాయి. ఇప్పటికైతే దేశవ్యాప్తంగా ఎక్కువగా మారుతీ కార్లదే పెద్ద మొత్తంలో అమ్మకం జరుగుతుంది. కాగా, మారుతీ సుజుకీ కంపెనీకి దాదాపు 3లక్షల 25వేల బుకింగ్​లు పెండింగ్​లో ఉన్నట్టు అంచనా. ఇవన్నీ సెమీ కండక్టర్ల కొరత కారణంగా మేకింగ్​ ఆగిపోయాయని మారుతీ సుజుకీ మార్కెటింగ్​, సేల్స్​ సీనియర్​ ఎగ్జిక్యూటివ్​ డైరెక్టర్​ శశాంక్​ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement