తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. ఉదయం 10 గంటలకు ఉభయ సభలు భేటీ కానున్నాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సభ్యులంతా చర్చించనున్నారు. చర్చకు సీఎం రేవంత్రెడ్డి సమాధానం ఇవ్వనున్నారు. ఇక.. ఎమ్మెల్యే వేముల వీరేశం అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రతిపాదిస్తారు. దాన్ని ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాస్ రెడ్డి బలపరుస్తారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి చర్చలో పాల్గొంటారు.
కాగా, మండలిలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఈ తీర్మానాన్ని ప్రతిపాదిస్తారు. మరో ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ దీన్ని బలపర్చనున్నారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గవర్నర్ తమిళిసై నిన్న (గురువారం) ప్రసంగించించారు . ఇక.. నేడు (శుక్రవారం) మంత్రి మండలి సమావేశం కానున్నది. ఈ సందర్భంగా ఓటాన్ బడ్జెట్ అకౌంట్ పద్దులను కేబినెట్ ఆమోదించే అవకాశం ఉంది.