Friday, November 22, 2024

అన్ని వేరియంట్ల‌కి ఒకే చికిత్స – ప‌రిశోధ‌న చేస్తోన్న వైద్య నిపుణులు

క‌రోనా థ‌ర్డ్ వేవ్ విల‌య‌తాండ‌వం చేస్తోంది. సామాన్య జ‌నంతో పాటు సెల‌బ్రిట్రీలు క‌రోనా మ‌హ‌మ్మారిబారిన ప‌డుతున్నారు. అయితే వ్యాక్సిన్ తీసుకున్న‌వారికి కూడా క‌రోనా సోక‌డం గ‌మ‌నార్హం. ఈ మేర‌కు క‌రోనా చికిత్స కోసం రెండు కొత్త ఔష‌ధాల‌పై ల‌క్నోలోని సెంట్ర‌ల్ డ్ర‌గ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూడ్ ప‌రిశోధ‌న చేస్తోంది. దాంతో ఎవ‌రి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఉండే మెడిసిన్ ని పేషంట్ల‌కి అంద‌జేసే ప‌నిలో ఉన్నారు. కరోనా పేషెంట్లకు సురక్షితమైన ఔషధ కాంబినేషన్ ను ఇవ్వడంపై చీఫ్ సైంటిస్ట్ రవి శంకర్ నేతృత్వంలోని బృందం దానిపై ఇప్పటికే రీసెర్చ్ మొదలుపెట్టింది. వేర్వేరుగా పనితీరును కనబరిచే యాంటీ వైరల్ మందులను కలిపి వాడితే మెరుగైన ఫలితాలుంటాయని నిపుణులు వెల్ల‌డించారు అలాంటి రెండు కాంబినేషన్లపై తాము ప్రయోగాలు చేస్తున్నామన్నారు రవిశంకర్. ఉమిఫెనోవిర్–మోల్నుపిరవిర్, ఉమిఫెనోవిర్–నిక్లోసమైడ్ (యాంటీ పారాసైటిక్) మందులతో ట్రీట్ మెంట్ చేయడంపై దృష్టి సారించామని తెలిపారు. మోల్నుపిరవిర్ తో దుష్ప్రభావాలు ఎక్కువగా ఉండడంతో కేవలం అత్యవసర వినియోగానికే మన దేశంలో ఆమోదం లభించింద‌న్నారు.

ఈ నేపథ్యంలోనే మోల్నుపిరవిర్ కాంబినేషన్ లో దాని డోసేజ్ వీలైనంత తక్కువగా ఉండేలా చూస్తున్నామన్నారు. దానికి ఉమిఫెనోవిర్ ను కలపడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవన్నారు. కండరాల డ్యామేజీ, ఎముక కార్టిలేజ్ దెబ్బతినడం వంటి దుష్ప్రభావాలు రావని అన్నారు. ఒకవేళ ఇది సక్సెస్ అయితే కరోనా చికిత్సలో ప్రభావవంతమైన ఔషధంగా ఉమిఫెనోవిర్ ఉపయోగపడుతుందన్నారు. కరోనా చికిత్సలో నిక్లోసమైడ్ ను వాడుతున్నా.. భారీ మోతాదులో తీసుకోవాల్సి ఉంటోందని, దాని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని రవిశంకర్ వెల్లడించారు. మంచి ఫలితాలు రావాలంటే ఉమిఫెనోవిర్ తో కలిపి నిక్లోసమైడ్ ను పక్కాగా ఎంత మోతాదులో ఇవ్వాల్సి ఉంటుందన్నదానిపై రీసెర్చ్ చేస్తున్నామన్నారు. కరోనాలోని అన్ని వేరియంట్లకూ ఒకే చికిత్సను అందించేందుకు వీలుగా ఔషధాలపై సీడీఆర్ ఐ టీం రాత్రింబవళ్లూ పనిచేస్తోందని సంస్థ డైరెక్టర్ ప్రొఫెసర్ తపస్ కుందూ చెప్పారు. మ‌రి వారు చేస్తోన్న ప‌రిశోధ‌న‌లు ఫ‌లిస్తే ఇక‌పై అన్ని వేరియంట్ల‌కి ఒకే చికిత్స అందుబాటులోకి రానుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement