Saturday, November 23, 2024

ట్రిపుల్ ఆర్ స్పాయిల‌ర్స్ పై రియాక్ట్ అయిన ఆర్.ఆర్.ఆర్ టీమ్…

దేశ వ్యాప్తంగా ఎక్క‌డ చూసినా ‘ఆర్ఆర్ఆర్’ జోష్ క‌నిపిస్తుంది. ఏ థియేట‌ర్‌కు వెళ్ళినా ట్రిపుల్ఆర్ బొమ్మే. సౌత్ నుంచి నార్త్ వ‌ర‌కు ఈ చిత్రాన్ని చూసేందుకు ప్రేక్ష‌కులు ప‌రుగులు తీస్తున్నారు. ‘బాహుబ‌లి’ వంటి అంత‌ర్జాతీయ స్థాయి సినిమా త‌ర్వాత రాజ‌మౌళి నుంచి వ‌చ్చిన సినిమా కావ‌డంతో ప్రేక్ష‌కులు భారీ అంచ‌నాల‌తో థియేట‌ర్ల‌కు వెళ్తున్నారు. అంచాల‌కు ఏ మాత్రం త‌గ్గ‌కుండా ఈ చిత్రాన్ని రాజ‌మౌళి తెర‌కెక్కించాడు. రాజ‌మౌళి టేకింగ్… విజ‌న్‌కు ప్రేక్ష‌కులు, సినీప్ర‌ముఖులు ఫిదా అయిపోతున్నారు. తార‌క్‌, చ‌ర‌ణ్‌ల అభిమానుల‌ నాలుగేళ్ళ నిరీక్ష‌ణ‌కు తెర‌వేస్తూ శుక్ర‌వారం విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సంచ‌ల‌న విజ‌యం సాధిస్తూ క‌ల‌క్ష‌న్లు కొల్ల‌కొడుతుంది. .

ఈ సినిమాలో చ‌ర‌ణ్, తార‌క్‌ల న‌ట‌న‌కు విమ‌ర్శ‌కుల సైతం ప్ర‌సంశ‌లు కురిపిస్తున్నారు. కానీ ప్రేక్ష‌కుల అత్యుత్సాహం ‘ఆర్ఆర్ఆర్’ మేక‌ర్స్‌కు త‌ల‌నొప్పిగా మారింది. కొంద‌రు ప్రేక్ష‌కులు సినిమాను చూసి ఎంజాయ్ చేయ‌కుండా కీల‌క స‌న్నివేశాల‌ను వీడియోలు తీసి సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇద్ద‌రు హీరోల ఇంట్ర‌డ‌క్ష‌న్ సీన్లు గాని, ఇంట‌ర్వెల్ సీన్లుగాని ఇలా సినిమాలోని ముఖ్య‌మైన స‌న్నివేశాల‌ను పోస్ట్ చేస్తూ ఇప్ప‌టివ‌ర‌కు సినిమాను చూడ‌ని ప్రేక్ష‌కుల‌కు ఇంట్రెస్ట్ పోయేలా చేస్తున్నారు. ఇప్ప‌టికే చాలా మంది ప్రేక్ష‌కులు సగం సినిమా స్టేట‌స్‌ల‌లోనే చూశాం. మిగితా సగం కోసం అంత ఖ‌ర్చు పెట్టి చూడ‌టం అవ‌సరమా అంటూ కొంద‌రు నెటీజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఈ విష‌యంపై స్పందించిన ఆర్ఆర్ఆర్ మేక‌ర్స్. ‘డియర్ ఫ్యాన్స్ సినిమాలోని సీన్స్ రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయవద్దని, ఆర్ఆర్ఆర్ సినిమా మ్యాజిక్‏ను స్క్రీన్ పై చూసి మీరు ఎంజాయ్ చేసినట్టుగానే ఇతరులు కూడా ఎంజాయ్ చేయాలి’ అంటూ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి...

Advertisement

తాజా వార్తలు

Advertisement