హైదరాబాద్,ఆంధ్రప్రభ: రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన ఎస్‌ఐ, కానిస్టేబుల్ నియామకాలకు సంబంధించిన తుది రాతపరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఎస్‌ఐ, కానిస్టేబుల్ పోస్టులకు నిర్వహించిన తుది పరీక్ష ఫలితాలను తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు(టీఎస్‌ఎల్‌పిఆర్‌బి ) మంగళవారం విడుదల చేసింది. ఈ పరీక్షలకు 1,79,459 మంది అభ్యర్థులు పరీక్షలు హాజరుకాగా , 1,50,852 (84 శాతం ) మంది అర్హత సాధించారు. కానిస్టేబుల్ సివిల్,ట్రాన్స్ పోర్టు తదితర పోస్టులకు 98, 218మంది అర్హత సాధించినట్లు బోర్డు తెలియజేసింది.
కానిస్టేబుల్ ఐటి అండ్ కమ్యూనికేషన్స్‌కు4,564 మంది, ఎస్‌ఐ సివిల్ కు 43,709 మంది,ఎస్‌ఐ ఐటీ అండ్ కమ్యూనికేషన్‌కు 729 మంది,డ్రైవర్ అండ్ ఆపరేటర్ పోస్టులకు 1,779 మంది, ఫింగర్ ప్రింట్ బ్యూరో ఎఎ స్‌ఐ పోస్టులకు 1,153 మంది, పోలీస్ ట్రాన్స్ పోర్టు ఎస్‌ఐ పోస్టులకు 463 మంది, పోలీస్ కానిస్టేబుల్ మెకానిక్ పోస్టులకు 283 మంది అర్హత సాధించినట్లు బోర్డు ఒక ప్రకటనలో పేర్కొంది. అభ్యర్థుల మార్కుల వివరాలు బోర్డు వెబ్‌సైట్‌లోఅందుబాటులో ఉంచినట్లు తెలిపింది.