Friday, November 22, 2024

ప్రాంతీయ పార్టీలే దేశానికి దిశానిర్దేశం చేస్తాయి : ఎమ్మెల్సీ క‌విత‌

ప్రాంతీయ పార్టీలే సార‌థ్య‌ బాధ్య‌త‌లు వ‌హిస్తూ దేశానికి దిశానిర్దేశం చేస్తాయ‌ని ఎమ్మెల్సీ క‌విత పేర్కొన్నారు. ఈరోజు ఆమె ఓ మీడియా సంస్థ‌తో మాట్లాడారు. ప్ర‌జ‌ల సంక్షేమం కోసం ప్రాంతీయ పార్టీల‌కు నిర్దిష్ట‌మైన ఎజెండా ఉంద‌ని, రాహుల్ గాంధీ ఈ విష‌యాన్ని అర్థం చేసుకోవాల‌ని, ఎందుకంటే మ‌హారాష్ట్ర‌లో వాళ్లు అధికారంలో ఉన్నార‌ని, ప్రాంతీయ పార్టీ స‌పోర్ట్‌తోనే అక్క‌డ వాళ్లు అధికారంలో ఉన్న‌ట్లు ఎమ్మెల్సీ క‌విత తెలిపారు. మ‌హారాష్ట్ర‌లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓ తోక పార్టీగా మారింద‌ని, రాబోయే రోజుల్లో దేశంలోనూ ఆ పార్టీ తోక పార్టీగా మిగులుతుంద‌ని, ప్రాంతీయ పార్టీలే సార‌థ్య‌ బాధ్య‌త‌లు వ‌హిస్తూ దేశానికి దిశానిర్దేశం చేస్తాయ‌ని ఎమ్మెల్సీ క‌విత పేర్కొన్నారు.కాంగ్రెస్ పార్టీ త‌ర‌హాలో త‌మ‌కు నాయ‌క‌త్వ సంక్షోభం లేద‌ని ఎమ్మెల్సీ క‌విత స్ప‌ష్టం చేశారు. పార్టీలో ప్ర‌క్షాళ‌న చేప‌ట్టాల‌ని కాంగ్రెస్ నిర్ణ‌యించింద‌ని.. దేశంలో నిరుద్యోగం పెరిగింద‌ని, మ‌త‌ప‌రమైన‌ స‌హ‌నం లోపించింద‌ని, ఈ నేప‌థ్యంలో ప్రాంతీయ పార్టీల విజ‌యంపై కాంగ్రెస్ అసూయ వ్య‌క్తం చేసిన‌ట్లు ఆమె వెల్ల‌డించారు. మెరుగైన పాల‌న‌ అందించాము కాబ‌ట్టే తాము స‌క్సెస్ అయిన‌ట్లు ఆమె తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement