Friday, November 22, 2024

అత్యంత అరుదైన జాతి.. పసుపురంగు తాబేలును ఎప్పుడైనా చూశారా!

జీవన గమనంలో ఎన్నో వింతలు, విశేషాలు చూస్తుంటాం.. జీవులు తమ మనుగడ కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాయి. అయితే ఇప్పుడు మనం చూస్తున్నది మాత్రం కాస్త డిఫరెంట్​ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే తాబేలు (టార్టాయిస్) నీటిలో ఉండే జీవి. వీటిని చాలామంది చూసే ఉంటారు. కానీ, అన్ని తాబేళ్ల వంటిది ఇది మాత్రం కాదు. ఎందుకంటే దీనికి ఇదే స్పెషల్​. తాబేళ్లన్నీ దాదాపు నలుపు, మదురు వర్ణంలో ఉంటే ఇది మాత్రం పసుపు పచ్చ రంగులో మెరిసిపోతోంది..

ఒడిశాలోని బాలాసోర్ జిల్లా సిములియా గ్రామంలోని ఓ చెరువు నుంచి మంగళవారం అరుదైన పసుపు తాబేలును రక్షించారు. అక్కడి గ్రామస్థులు దానిని రక్షించి నీటి టబ్‌లో వేశారు. ఆ తాబేలును గ్రామానికి చెందిన ఒక యువకుడు గుర్తించాడు. గ్రామంలోని కొంతమందితో కలిసి వెళ్లి దానిని కాపాడారు. అనంతరం ఆ తాబేలును అటవీశాఖ అధికారులకు అప్పగించారు. తాబేలు పెంకు, శరీరం పసుపు రంగులో ఉంది. ఇది చాలా అరుదైన తాబేలు జాతి అని అంటున్నారు అటవీశాఖ అధికారులు. ముఖ్యంగా 2020 జూలైలో బాలాసోర్‌లోని సుజన్‌పూర్ గ్రామం నుండి కూడా ఇట్లాంటి పసుపు రంగు తాబేలు ఒకటి కనిపించిందని, దాన్ని కూడా తాము రక్షించినట్టు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement