దేశంలో ఏ మూల జరిగినా అభివృద్ధి అభివృద్ధి కాకుండా పోతుందా? ఎక్కడ జరిగినా దేశానికే మంచిది కదా? అట్లాంటిది పరుగెత్తే రాష్ట్రాలను దెబ్బతీసేలా కేంద్రంలోని బీజేపీ, ప్రధాని మోదీ వ్యవహరిస్తున్నారు. ఇది అవగాహన లేకనే జరుగుతోంది. గుజరాత్ అయితేందీ, అస్సాం అయితేందీ, తమిళనాడు అయితేందీ, తెలంగాణ అయితేందీ.. ఎక్కడైనా దేశంలోనే డెవలప్మెంట్ జరుగుతుంది కదా అని చెప్పుకొచ్చారు సీఎం కేసీఆర్. ఇవ్వాల సాయంత్రం ప్రగతి భవన్లో సుధీర్ఘంగా జరిగిన మీడియా మీట్లో పలు అంశాలపై మాట్లాడారు. ఎంతో మంది రాక్షసులు పోయారు. మీరు పోవడం పెద్ద లెక్కేమీ కాదు. ఏక్నాథ్ షిండేలను సృష్టిస్తామని చెప్పడం మీ రాజకీయ దురహంకారానికి పరాకాష్ట కాదా అని ప్రశ్నించారు సీఎం.
ఇటు పక్కనే ఉన్న కర్నాటక రాష్ట్రంలో పాలన ఎట్లున్నది, తెలంగాణలో పరిపాలన ఎట్లున్నదో చూస్తే తెలుస్తుంది కదా. ఎందుకనం తెలంగాణకు బీజేపీ ప్రభుత్వం రావాలే. నీళ్లు ఇయ్యకుండా, కరెంటు ఇయ్యకుండా అంగిలాగు చింపకుని ఆగమాగం కావడానికా? అని ప్రశ్నించారు సీఎం కేసీఆర్.