కామారెడ్డి జిల్లాలో విచిత్ర ఘటన జరిగింది. కామారెడ్డి రైల్వే స్టేషన్లో ఓ వ్యక్తి ఇవ్వాల (శనివారం) రాత్రి కొద్దిసేటక్రితం హల్ చల్ చేశాడు. ఇంటర్ సిటీ ట్రైన్‌కు ఎదురెళ్లి కాసేపు హంగామా సృష్టించాడు. అతడిని గమనించిన లోకోపైలట్ అప్రమత్తమై రైలుని నిలిపేశాడు. రైల్వే అధికారులు హుటాహుటిన అక్కడికి తరలివచ్చారు. పరిస్థితి గమనించి అతడిని బయటకు తీసుకొచ్చేందుకు యత్నించారు. అయినా.. పట్టాల మీద నుంచి రాకుండా ఇట్లా దాదాపు 20 నిమిషాల పాటు రైలుని పట్టాలమీద కదలకుండా ఆపేశాడు. అకారణంగా రైలుని ఆపేసి హల్చల్ చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Big Breaking | ఇంటర్సిటీకి ఎదురెళ్లిన వ్యక్తి.. పట్టాలపై 20 నిమిషాలు హంగామా!
Advertisement
తాజా వార్తలు
Advertisement