Monday, November 18, 2024

Breaking: వ‌ర‌ద‌లో చిక్కుకున్న ప్ర‌జ‌లు, 80 మందిని కాపాడిన అధికారులు.. 71 అడుగులు దాటిన గోదావ‌రి

భద్రాచలం, (ప్రభ న్యూస్): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలంలో మాన‌వ‌త్వం ప‌రిఢ‌విల్లింది. శాంతినగర్ కాలనీ వద్ద ఆంధ్రాకు చెందిన‌ 80 మందిని గోదావరి ముంపు నుంచి తెలంగాణ అధికారులు మానవత్వంతో కాపాడారు. అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం, గుండాల గ్రామస్తులు కొందరు ముంపులో చిక్కుకున్నారు. ప్రాణాలు అరచేత ప‌ట్టుకుని తెలంగాణ సరిహద్దులోని శాంతినగర్ వచ్చారు. త‌మ‌ను రక్షించాలని కేకలు వేయగా తెలంగాణ అధికారులు రెండు మోటార్ బోట్లు పంపి వారిని కాపాడారు.. ఇంకా వరదలో చిక్కుకుపోయిన మ‌రో 50 మంది బాధితులు అక్కడే ఉన్నార‌ని, వారిని కూడా కాపాడాలని బాధితులు వేడుకుంటున్నారు.

మ‌రోవైపు వ‌ర‌ద ఉధృతి పెర‌గ‌డంతో భ‌ద్ర‌చ‌లం టౌన్ నీట‌మునిగింది. రెండ్రోజుల క్రిత‌మే లోత‌ట్టు ప్రాంతాలు ముంపున‌కు గురికాగా, ఇవ్వాల (శుక్ర‌వారం) ఉద‌యం ఎగువ ప్రాంతాల‌ను కూడా వ‌ర‌ద నీరు చుట్టుముట్టింది. ప్ర‌స్తుతం గోదావ‌రి, భ‌ద్రాద్రి సీతారాముల వారి ఆల‌యం రెండూ క‌లిసిపోయాయి. రోడ్లు, వీధులు, మాడ వీధులు మొత్తం నీట‌మునిగాయి. శుక్ర‌వారం రాత్రి 11 గంట‌ల వ‌ర‌కు భ‌ద్రాచ‌లం వ‌ద్ద గోదావ‌రి న‌ది 71.10 అడుగ‌ల నీటి మ‌ట్టం ఉంది. 24.34ల‌క్ష‌ల క్యూసెక్కుల నీరు దిగువ‌కు విడుద‌ల చేస్తున్నారు. ఇంకా మూడో ప్ర‌మాద హెచ్చ‌రిక కొన‌సాగుతున్న‌ట్టు అధికారులు ప్ర‌క‌టించారు.

ప్లాష్ ప్లాష్..

బూర్గంపాడులో వరద బాధితులను నాటుపడవలో తరలిస్తుండగా పడవ బోల్తాకొట్టింది. దీంతో ఒకరు గల్లంతయినట్టు సమాచారం. ఈ క్రమంలో 9 మందిని స్థానికులు కాపాడారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement