Wednesday, November 20, 2024

Big Story: ఒమిక్రాన్‌ ఎఫెక్ట్‌.. ఐటీ అనుబంధ ఉపాధి రంగాలపై కోలుకోలేని దెబ్బ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ప్రస్తుతం కొనసాగు తున్న ఐటీ పరిశ్రమ బూమ్‌తో ఈ రంగంలో ప్రత్యక్ష ఉద్యోగాలు ఏటికేడు పెరుగుతుంటే మరోపక్క కొవిడ్‌ ప్రభావంతో ఈ రంగం ద్వారా వచ్చే పరోక్ష ఉపాధి మాత్రం గణనీయంగా తగ్గుతోంది. 2020 ప్రథమా ర్థంలో కొవిడ్‌ సంక్షోభం తలెత్తిన తర్వాత హైదరాబాద్‌ నగరంలోని 90శాతం సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు వర్క్‌ ఫ్రమ్‌హోమ్‌ విధానంలో ఇంటి నుంచి పనిచేస్తుం డడం వల్లే ఈ పరిస్థితి తలెత్తినట్లు రాష్ట్ర ఐటీ శాఖ అధి కారులు చెబుతున్నారు. సాధారణంగా ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులను మూడు షిఫ్ట్‌లలో కార్యాలయాలకు తరలించే లాజిస్టిక్స్‌ సేవలు, ఆఫీస్‌ ఫెసిలిటీ నిర్వహణ, హౌస్‌ కీపింగ్‌, క్యాంటీన్‌ వంటి సేవలన్నిం టినీకాంట్రాక్టు పద్ధతిలో సప్లయర్లకు అప్పగిస్తుంటాయి. ఈ సేవలకు సప్లయర్ల సంస్థలు టెండర్లు వేసి కాంట్రాక్టు దక్కించుకుని ఇతర సంస్థలకు, వ్యక్తులకు సబ్‌ కాంట్రాక్టు ఇస్తుంటాయి. సప్లయర్లు, సబ్‌ కాంట్రాక్టర్లు ఉద్యోగులను నియమించుకుని ఆయా సేవలన్నింటిని నిర్వహిస్తుంటారు.

ఇలా హైదరాబాద్‌ ఐటీ పరిశ్రమ మీద సుమారు 10 లక్షల మంది దాకా పరోక్ష ఉపాధి పొందుతుంటారు. ఇది నగరంలో ఐటీ పరిశ్రమపై ప్రత్యక్షంగా ఆధారపడే 5లక్షల మంది ఉద్యోగులకు రెట్టింపు సంఖ్యలో ఉండడం గమ నార్హం. అయితే సుమారు రెండు సంవత్సరాల నుంచి ఐటీ ఉద్యోగులు ఇళ్లకే పరిమితమవడంతో లాజిస్టిక్స్‌, క్యాంటిన్‌, ఆఫీస్‌ ఫెసిలిటీ మేనేజ్‌మెంట్‌, హౌస్‌ కీపిం గ్‌కు సంబంధించి కొవిడ్‌కు ముందు ఇచ్చినట్లుగా కంపెనీలు సప్లయర్లకు కాంట్రాక్టులివ్వడం ఆపేశాయి. దీంతో సప్లయర్‌, సబ్‌ కాంట్రాక్టు సంస్థలు ఆయా విభాగాల్లోని కాంట్రాక్టు ఉద్యోగులకు పని కల్పించడం ఆగిపోయింది. దీంతో ఐటీ రంగంపై పరోక్షంగా ఆధారపడి ఉపాధి పొందుతున్న తాత్కాలిక ఉద్యోగు లకు పని లేకుండా పోయింది.

వర్క్‌ ఫ్రమ్‌ ఆఫీసు వాయిదాతో మళ్లీ నిరాశే..
హైదరాబాద్‌ ఐటీ కంపెనీలపై పరోక్షంగా ఆధా రపడి ఉపాధి పొందుతున్న ట్రాన్స్‌పోర్టు, ఆఫీసు మేనేజ్‌మెంట్‌, హౌస్‌కీపింగ్‌, క్యాంటీన్లు తదితర రంగాలకు చెందిన వారంతా ఈ జనవరి నుంచి ప్రారంభమవ్వాల్సి ఉన్న ఐటీ ఉద్యోగుల వర్క్‌ ఫ్రమ్‌ ఆఫీసుపై ఆశలు పెట్టుకున్నారు. అయితే తాజాగా ఒమిక్రాన్‌ వేరియెంట్‌, థర్డ్‌ వేవ్‌తో పెరుగుతున్న కేసులతో కరోనా వైరస్‌ విరుచుకుపడుతుండడంతో ఐటీ కంపెనీలు తమ వర్క్‌ ఫ్రమ్‌ ఆఫీసు కార్యక్రమాన్ని మళ్లీ వాయిదా వేసుకున్నాయి. దీంతో ఐటీ రంగంపై పరోక్షంగా ఆధారపడి ఉపాధి పొందుతున్న వారికి మళ్లీ నిరాశే ఎదురైందని ఐటీ కంపెనీలకు పలు విభాగాల్లో సేవలందిస్తున్న ప్రముఖ సప్లయర్‌ సంస్థల ప్రతినిధులు చెబుతున్నారు. ఈ ఏడాది నుంచి కనీసం 50శాతం మంది ఉద్యోగులైనా కార్యాలయాలకు వసా ్తరని, వారికి ట్రాన్స్‌పోర్ట్‌తో పాటు ఇతర సేవలు అందించేందుకు ఔట్‌ సోర్సింగ్‌ కాంట్రాక్టులు మళ్లీ ప్రారంభం అవుతాయనుకున్న తమకు ఒమిక్రాన్‌ దెబ్బకు నిరాశే ఎదురైందని వారు వాపోతున్నారు.

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌తో కంపెనీలకు గణనీయంగా పెరిగిన లాభాలు…
ఐటీ ఉద్యోగులు కార్యాలయాలకు రాకుండా ఇళ్లలో నుంచే పనిచేస్తుండడంతో ఆఫీసు నిర్వహణ, ట్రాన్స్‌పోర్ట్‌, విద్యుత్‌ బిల్లుల ఖర్చులు కలిసివచ్చి సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు లాభాల బాట పడుతున్నట్లు ఇటీవలి కాలంలో కంపెనీలు వెల్లడిస్తున్న ఆర్థిక ఫలితాలే చెబుతున్నాయని ఐటీ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ కంపెనీలకు కలిసి వస్తున్నప్పటికీ ఐటీ పరిశ్రమపై పరోక్షంగా ఆధారపడిన లక్షలాది మంది కాంట్రాక్టు ఉద్యోగులకు ఉపాధి లేకుండా చేసిందని వారు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement