Wednesday, November 20, 2024

బాలుడి హ‌త్య దుర‌దృష్ట‌క‌రం.. ఆ కుటుంబానికి అండ‌గా ఉంటాం.. త‌ల‌సాని

హైదరాబాద్ లోని సనత్ నగర్ లో బాలుడి హత్య ఘటనపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. బాలుడి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఆయన నిందితులను కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని మంత్రి తలసాని వెల్లడించారు. బాలుడిని హిజ్రా ఇమ్రాన్ హత్య చేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. భాగ్యనగరంలో బాలుడి హత్య తీవ్ర కలకలం రేపుతోంది.

బస్తీలో బాబును అపహరించిన కిరాతకులు.. అతి కిరాతకంగా హతమార్చారు. ఎక్కడికక్కడ ఎముకల్ని విరిచి.. ఓ బకెట్‌లో కుక్కారు. స్థానికంగా నివసించే ఓ హిజ్రా ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. హత్య తీరును చూసి.. నరబలి ఇచ్చినట్లుగా స్థానికులు అనుమానించారు. అయితే పోలీసులు మాత్రం విచారణ చేపట్టి ఆర్థిక పరమైన హత్యగా నిర్ధారించారు. చిట్టీ డబ్బుల గురించే బాలుడి హత్య..: హైదరాబాద్‌ సనత్‌నగర్‌ పారిశ్రామికవాడలోని అల్లాదున్‌ కోఠిలో నివసించే రెడీమేడ్‌ దుస్తుల వ్యాపారి వసీంఖాన్‌ కుమారుడిని స్థానికంగా నివసించే ఫిజాఖాన్‌ అనే ఓ హిజ్రా హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement