స్మార్ట్ఫోన్ యుగంలో తల్లిదండ్రుల తీరు ఎట్లుందో ఈ వీడియో చూస్తే స్పష్టంగా అర్థం అవుతుంది. ఫోన్లో మాట్లాడుతూ స్కూల్కు పంపాల్సిన చిన్నారిని రోడ్డుమీదికి వదిలేసింది ఓ తల్లి.. అంతలోనే ఆ రూట్లో ఓ కారు రావడం.. కనురెప్ప మూసి తెరిచే టైమ్లో యాక్సెడెంట్ తప్పిపోయింది..
వీడియో చూస్తున్న వారు హమ్మయ్య అని అనుకోవాల్సిందే. ఎందుకంటే ఆ పాపకు దేవుడిలా వచ్చి కాపాడాడు ఓ ఆర్మీ పర్సన్. అంతేకాకుండా ఆ పాపను స్లిట్ ఆఫ్ సెకన్స్లో పట్టుకుని కారు యాక్సిడెంట్ నుంచి కాపాడడమే కాకుండా అప్పటికీ ఆ తల్లి వదలకుండా మాట్లాడుతున్న ఫోన్ని లాగేసుకుని నేలకు విసిరి కొడతాడు.
ఈ వీడియో చూసిన తల్లిదండ్రుల్లో కానీ, మీకు తెలిసిన వారికి ఎవరికైనా కానీ ఇట్లాంటి విపరీత ధోరణి ఉంటే ఆ అలవాటు నుంచి వారిని కాపాడండి. ఫోన్ వాడకం మంచిదే కానీ, అతి వద్దని చెప్పండి.. ఈ వీడియోను వారికి చూపించి వారిలో మార్పు వచ్చేలా ప్రయత్నం చేయండి..
వీడియో లింక్ కోసం.. www.prabhanews.comలో చూడండి..