మానవుడు పరిణితిని, పరిపక్వతను సాధిస్తూ శాస్త్ర సాంకేతిక రంగాల్లో పురోగమిస్తున్నప్పటికీ ఇటువంటి విషయాల్లో ఇంకా పురోగమనం చెందాల్సిన అవసరం ఉందని భావిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. దాని కోసం క్రమపద్ధతిలో ఏ మతానికి సంబంధించినటువంటి మత బోధకులైనా, మత కార్యాలయాలైనా ఆలయాలైనా చర్చిలైనా, మసీదులైనా, మరొకటైనా.. బౌద్ధ జైన మందిరాలైనా హ్యుమన్ ఇంపార్టెన్స్ గురించి, హ్యుమన్ క్వాలిటీస్, ఇంప్రూవ్మెంట్ గురించి, కరుణ, దయ వంటి గ్రేస్పుల్ జీవితం గురించి ఎంత ఎక్కువ ప్రచారం చేస్తే అంత మంచిదని ఈ సందర్భంగా పెద్దలందరికీ మనవి చేస్తున్నానని కేసీఆర్ పేర్కొన్నారు. అటువంటి ప్రపంచం రావాలని క్రీస్తు తర్వాత కూడా ఎందరో మహనీయులు, అనేక మంది స్వేచ్ఛ కోసం స్వాతంత్ర్యం కోసం, ప్రగతి కోసం అందరూ చక్కగా బతికేటటువంటి సమాజం కోసం ప్రయత్నాలు చేశారని కేసీఆర్ గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ముఖ్య అతిథిగా సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
మనిషి ప్రేమించడం అలవాటు చేసుకోవాలి..
క్రైస్తవులందరికీ హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనిషి తనకు తాను ఏ విధంగా ప్రేమించుకుంటాడో, పొరుగువారిని, ఇతరులను కూడా ప్రేమించడం అలవాటు చేసుకోవాలని చెప్పి ఒక శాంతిదూతగా ప్రపంచానికి సందేశం ఇచ్చినటవుంటి మహోన్నతమైనటువంటి దేవుని బిడ్డ జిసస్ క్రీస్తు. క్రీస్తు బోధనలు నిజంగా తూచా తప్పకుండా ఆదరిస్తే ఈ ప్రపంచంలో ఈర్ష్య, అసూయ, ద్వేషం, స్వార్థ్యం, ఇతరుల పట్ల అసహనం అనేవి ఉండనే ఉండవు.
ప్రపంచంలో యుద్ధాలే జరగవు..
ఒక మాటలో చెప్పాలంటే ప్రపచంలో యుద్ధాలే జరగవు. నేరస్తులుగా పరిగణించి జైళ్లలో ఉండే వారి కోసం జైళ్లే అవసరం ఉండవు. నిజంగా వారు చెప్పిన ప్రపంచం, వారు కలలగన్న ప్రపంచం, క్రీస్తు కాంక్షించిన ప్రపంచం, ఎంత ఉదాత్తమన, ఔన్నత్యమైనటువంటి, ఎంత గొప్ప మానవ ప్రపంచం. అది సాధించగలిగితే మనిషి దేవుడు అయిపోతాడు. ఆ సందేశం తీసుకునే వారు దేవదూత, దేవుని బిడ్డగా మన మధ్యకి వచ్చి చాలా ప్రయత్నం చేశారు. ఎన్నో హింసలకు, అవమానాలకు, నమ్మిన సొంత వ్యక్తుల చేతిలోనే హత్యకు గురయ్యేటువంటి పరిస్థితులను ఎదుర్కొంటూ కూడా తన చివరి క్షణంలో కూడా తుదిశ్వాస విడిచే వరకు విశాలమైనటువంటి ఈ భూమి అంతా వసుదైక కుటుంబంగా, యూనివర్స్ ఒక ఫ్యామిలీగా ఉండాలని ఆకాంక్షించిన మహోన్నతుడు మన క్రీస్తు. అట్లాంటి అనేక మంది పెద్దలు, శాంతిదూతలు, దైవ దూతలు మన మధ్యకు వచ్చి చెప్పారు.
క్రీస్తు మార్గంలో పయనించడానికి ప్రయత్నిద్దాం..
ఈ పవిత్రమైన క్రీస్తు జన్మించిన డిసెంబర్ మాసంలో మనందరం కూడా అటువంటి భావాలు అలవాటు చేసుకోవడానికి, ఆచరించడానికి ఆయన మార్గంలో పయనించడానికి ప్రయత్నిద్దిదామని, ఆ ప్రయత్నంలో మనం విజయం సాధించాలని నేను మనస్ఫూర్తిగా క్రీస్తు భగవానుడిని ప్రార్థిస్తున్నాను. మన అందరికీ కూడా శుభం కలగాలని కోరుకుంటున్నాను. కార్డినల్ పూల ఆంథోని బిషప్ స్థాయి నుంచి పైకి ఎదిగి పోప్ను ఎలెక్ట్ చేసే కార్డినల్స్లో భాగస్వామి కావడం మన తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణం. గత సంవత్సరం ఇక్కడ నేను పార్టిసిపెట్ అయినప్పుడు వారు బిషప్ గా ఉండేవారు. ఇప్పుడు వారు ప్రపంచంలోనే ఉన్నతమైనస్థాయికి ఎదగడం చాలాచాలా మనందరికీ గర్వకారణం. మనందరి, మన రాష్ట్రం, మన భారతదేశం తరఫున వారికి ప్రత్యేకమైన శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాను అని కేసీఆర్ తెలిపారు.