Sunday, November 17, 2024

ఎయిర్ పోర్ట్ ప్రైవేటీకరణ యోచనలో కేంద్రం

మొన్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, రేపు శంషాబాద్ ఎయిర్ పోర్ట్… అవును మీరు విన్నది నిజమే ప్రభుత్వ ఆస్తులన్నీ ప్రైవేటు పరం చేయడమే లక్ష్యంగా బిజెపి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. వాటి నుంచి నష్టం వస్తుందా లాభం వస్తుందా అనేది పక్కనపెట్టి ప్రైవేటు పరం చేయడమే లక్ష్యంగా దృష్టి పెట్టింది. ఇప్పటికే ప్రైవేటు పరమైన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో.. మిగిలి ఉన్న భాగాన్ని కూడా విక్రయించాలని మోదీ సర్కారు భావిస్తోందట. మొత్తం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి కలిపి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో 26 శాతం వాటా ఉండగా.. శంషాబాద్ తోపాటు ఢిల్లీ ,ముంబై, బెంగళూరు ఎయిర్ పోర్ట్ లను కూడా ప్రభుత్వానికి మిగిలివున్న వాటాలను అమ్మేసేందుకు ప్రయత్నాలు చేస్తుందట.

ఇక కొత్తగా ఇప్పుడు మరో 13 ఎయిర్ పోర్ట్ లను ప్రైవేటు పరం చేయాలనే ఆలోచనలో మోడీ ప్రభుత్వం ఉందట. గతేడాది 6 ఎయిర్ పోర్టులను అదానీ గ్రూప్ కు విక్రయించిన సంగతి తెలిసిందే. ఇక దేశవ్యాప్తంగా ఇప్పుడు చూసుకుంటే వంద ఎయిర్ పోర్ట్ లు ప్రభుత్వం చేతిలో ఉన్నాయి. అందులో కొన్నింటిలో వాటాలు ఉండగా మరికొన్ని పూర్తిస్థాయిలో ప్రభుత్వం చేతిలో ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement