Saturday, November 23, 2024

విలేజీలను విజిట్​ చేస్తున్న ఎమ్మెల్యేలు.. ఈ ముగ్గురిలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్!

ప్రజాప్రతిధులుగా నిత్యం ప్రజల మధ్య ఉండాలనుకునే లీడర్లు వీరు.. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలదీ ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్ కనిపిస్తోంది.​ ప్రజలతో మమేకమై ఉంటున్నా.. ఇప్పుడు విలేజీలను విజిట్​ చేస్తూ గ్రామీణుల మంచి చెడు కనుక్కొంటున్నారు. కొన్ని కొన్ని ఇష్యూస్​ని అక్కడికక్కడే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటూ.. మరికొన్నింటికి శాశ్వత పరిష్కారం దిశగా ఆలోచన చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ కొత్త పంథాలో ముందుకు సాగుతున్నారు. మరి ఆ ముగ్గురు లీడర్లు ఎవరు? వారి డిఫరెంట్​ స్టైల్ ఏంటో చదివి తెలుసుకుందాం..

– వికారాబాద్, ప్రభ న్యూస్

వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్‌ ‘‘మీతో నేను’’ అనే కార్యక్రమాన్ని చేపట్టారు. వారంలో ఐదు రోజులు ప్రజలకు మరింత దగ్గరగా ఉండాలని ఈ ప్రోగ్రామ్​ నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఉదయం ఏడు గంటలకు నియోజకవర్గంలోని పలు గ్రామాలలో పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలోని 120 గ్రామాలకు గాను 100 గ్రామాల్లో ‘‘మీతో నేను’’ కార్యక్రమం పూర్తి చేశారు.

ఇక.. చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య ‘‘శుభోదయం’’ పేరుతో నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో పర్యటిస్తున్నారు. వారానికి ఐదు రోజులపాటు పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. పలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు.

కాగా, తాండూర్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ‘‘పల్లెకు పల్లెకు పైలెట్’’ అనే కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామాల పర్యటనకు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే ఆనంద్ మొదట ప్రారంభించిన ‘‘మీతో నేను’’ కార్యక్రమం సక్సెస్​ కావడంతో పక్కన ఉన్న నియోజకవర్గలకు చెందిన మిగతా ఎమ్మెల్యేలు కూడా వారి స్టైల్​లోనే కొత్త కార్యక్రమాన్ని చేపట్టారు. ఎమ్మెల్యేలతో పాటు ఆయా శాఖల అధికారులను కూడా వారి వెంట తీసుకెళ్తున్నారు. ఇందులో తహసీల్దార్​, ఎంపీడీవో, ఎంఈవోలు ఉంటున్నారు. గ్రామాల్లో ఏ సమస్య ఉన్నా అక్కడికక్కడే పరిష్కారం చూపుతున్నారు.

- Advertisement -

వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ ఆయా గ్రామాల పర్యటనకు వెళ్లినప్పుడు సంబంధిత గ్రామానికి 5 లక్షల నుండి 10 లక్షల రూపాయల వరకు తన ఎమ్మెల్యే నిధి నుండి కేటాయిస్తున్నారు. మరో ఆరు నెలల్లో ఎన్నికలు రానున్నట్టు భావిస్తున్న నేపథ్యంలో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు తమ కార్యక్రమాలను వేగవంతం చేశారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement