దక్షిణాఫ్రికాతో జోహన్స్‌బర్గ్‌లోని వాండరర్స్ మైదానం వేదికగా నేటి నుంచి రెండో టెస్టు ప్రారంభం కానుంది. తొలిటెస్టులో సఫారీల కంచుకోట బద్దలుకొట్టి ఘనవిజయం సాధించిన కోహ్లీసేన ఈసారి సిరీస్‌పై కన్నేసింది. రెండో టెస్టులో గెలవడంతోపాటు సిరీస్‌ను తొలిసారి కైవసం చేసుకోవాలని ఆశిస్తోంది. మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భారత్ 1-0తో ఆధిక్యంలో ఉంది. దక్షిణాఫ్రికా గడ్డపై సిరీస్‌ను గెలిపించిన కెప్టెన్‌గా రికార్డు సృష్టించాలని కోహ్లీ భావిస్తున్నాడు. కొత్త సంవత్సరం మొదటిరోజే ఎటువంటి అలసత్వం లేకుండా కోహ్లీసేన సాధన చేసింది. హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ పర్యవేక్షణలో టీమిండియా క్రికెటర్లు చెమటోడ్చారు. కాగా వాండరర్స్‌లో భారతజట్టు 2018లో చివరిసారిగా టెస్టు మ్యాచ్ ఆడింది. ఆ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై భారత్ 63పరుగుల తేడాతో విజయం సాధించింది. హోరాహోరీగా జరిగిన మ్యాచ్‌లో ఇరుజట్లు చివరివరకూ గెలుపు కోసం పోరాడాయి. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 187పరుగులు చేస్తే.. దక్షిణాఫ్రికా 194పరుగుల వద్ద ఆలౌటైంది. అయితే రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 247పరుగులు చేసి ప్రొటీస్‌కు 241పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా జట్టు 177పరుగులు చేసి కుప్పకూలడంతో మ్యాచ్ భారత్ కైవసం చేసుకుంది.
కాగా భారతజట్టు ఇప్పటివరకు దక్షిణాఫ్రికా గడ్డపై ఒక్క టెస్టు సిరీస్ గెలవలేదు. ప్రస్తుతం ఫామ్‌లేమితో బాధపడుతున్న సఫారీ బ్యాటర్లకు భారత పేసర్లు చుక్కలు చూపిస్తున్నారు. టెస్టులకు గుడ్ బై చెప్పిన డికాక్ జట్టులో లేకపోవడంతో దక్షిణాఫ్రికా బ్యాటింగ్ బలం మరింత దిగజారింది. దీంతో వికెట్‌కీపర్, బ్యాటర్ కైల్ వెరైన్నే తుదిజట్టులో చేరనున్నాడు. కాగా టెస్టుసిరీస్ భారత్ తొలిసారి గెలుచుకుని చరిత్ర సృష్టించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
భారత అంచనా జట్టు: కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, పుజారా, విరాట్‌కోహ్లీ (కెప్టెన్), రహానె, రిషభ్‌పంత్, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, షమీ, బుమ్రా, సిరాజ్.
దక్షిణాఫ్రికా అంచనా జట్టు: డీన్ ఎల్గర్, మార్కరమ్, పీటర్సన్, డస్సెన్, బవుమా, కైల్, మార్కో జాన్‌సెన్, రబాడ, కేశవ్ మహారాజ్, ఎంగిడి, ఒలివర్.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital