అందరికీ ఆమోద యోగ్యంగానే మాస్టర్ ప్లాన్ ఉంటుందని.. రైతులు ఆందోళన చెందవద్దని రాష్ట్ర మంత్రి కేటీఆర్ అన్నారు. పట్టణాల అభివృద్దిపై మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. మాస్టర్ ప్లాన్ ఇంకా డ్రాప్ట్ దశలోనే ఉందన్నారు. కామారెడ్డి ఇండస్ట్రియల్ జోన్ పై కొందరు ఆందోళన చేస్తున్నారన్నారు. 500 ఎకరాలు ఇండస్ట్రియల్ జోన్ లోకి వెళ్తాయని అంటున్నారన్నారు.
మాస్టర్ ప్లాన్ డ్రాప్ట్ స్టేజీలో ప్రజలకు ఎందుకు చెప్పలేక పోయారని కామారెడ్డి మున్సిపల్ కమిషనర్ ను మంత్రి కేటీఆర్ అడిగారు. ఎవరినో ఇబ్బంది పెట్టేందుకు ప్రభుత్వం లేదన్నారు. డెవలప్ మెంట్ చేసేందుకే మాస్టర్ ప్లాన్లు అని కేటీఆర్ అన్నారు. ప్రజలకు అనుకూలంగా మాస్టర్ ప్లాన్లు ఉండాలని చెప్పామన్నారు. ప్రజలను ఇబ్బందులు పెట్టేలా మాస్టర్ ప్లాన్లు ఉండవన్నారు. ప్రజల నుంచి అభ్యంతరాలు వస్తే మార్పులు చేర్పులు చేసుకోవాలన్నారు. ఎవరు ఒత్తిడి చేసినా పట్టించుకోకుండా సమగ్రంగా సమీక్షించాలన్నారు.