Saturday, November 23, 2024

సీఎం ఇంటిని పేల్చివేస్తామని కాల్స్ చేసిన వ్యక్తి అరెస్ట్

ఓ అజ్ఞాత వ్యక్తి తమిళనాడు సీఎం స్టాలిన్ ఇంటిని బాంబులతో పేల్చివేస్తామంటూ బెదిరింపు కాల్స్ చేశాడు. ఎగ్మూర్ పోలీస్ కంట్రోల్ రూమ్ కు అజ్ఞాత వ్యక్తి ఈ బెదిరింపు కాల్స్ చేశాడు. స్టాలిన్ ఇంటి వద్ద బాంబులు పెట్టామని, కాసేపట్లో అవి పేలనున్నాయని, చేతనైతే అడ్డుకోవాలని అతను పోలీసులకు సవాల్ విసిరాడు. ఈ ఫోన్ కాల్ తో పోలీసు అధికారులకు ముచ్చెమటలు పట్టాయి. హుటాహుటిన బాంబ్ స్క్వాడ్ తో ముఖ్యమంత్రి నివాసం, కార్యాలయాలకు వెళ్లి తనిఖీలు చేశారు. ఆ తర్వాత అది ఫేక్ కాల్ అని నిర్ధారించుకున్నారు. ఆ తర్వాత ఫోన్ చేసిన ఆగంతుకుడు ఎవరనే విషయంపై దృష్టి సారించిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. సైబర్ క్రైమ్ విభాగంతో కలసి నిందితుడిని పోలీసులు గుర్తించారు. తిరునల్వేలి జిల్లా సుద్దమిల్లి గ్రామానికి చెందిన తామరైకన్నన్ ఈ ఫోన్ చేసినట్టు నిర్ధారించి, అరెస్ట్ చేశారు. గంజాయి మత్తులో అతను ఈ ఫోన్ చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement