Saturday, November 23, 2024

Health: మార్కెట్‌లోకి లేటెస్ట్‌ శ్వాసకోశ పరికరాలు.. విడుదల చేసిన ఎయిర్‌ ఫిజియో, మెడ్‌స్మార్ట్‌ సంస్థలు

ఊపిరితిత్తుల నుంచి విడుదలయ్యే స్రావాలను తొలగించడంతోపాటు వాయు నాళాల్లో ఎలాంటి అవరోధాలు లేకుండా నిర్వహించడంలో సహాయపడే శ్వాసకోశ పరికరాలను దేశీయ ఎయిర్‌ ఫిజియో, మెడ్‌ స్మార్ట్‌ సంస్థలు మార్కెట్‌లోకి ప్రవేశపెట్టాయి. శరీరంలోని వాయునాళాల గోడలకు ఉన్న మ్యూకస్‌ను ఈ పరికరాలు తొలగిస్తాయని ఎయిర్‌ ఫిజియో, బెటర్‌ బ్రీతింగ్‌ గ్రూప్‌ సీఈవో పౌల్‌ ఓ బ్రియాన్‌ అన్నారు.

వాయు నాళాల స్పందనలను మెరుగుపర్చడం ద్వారా ఊపిరితిత్తుల సామర్థ్యం మెరుగుపడేలా ఈ ఉపకరణాలు దోహదపడనున్నాయన్నారు. ఎయిర్‌ ఫిజియో ప్రస్తుతం యూఏఈలో యూనివర్సిటీ ఆఫ్‌ షార్జాతో కలిసి క్లినికల్‌ ట్రయల్స్‌ ను లాంగ్‌ కొవిడ్‌ బారిన రోగులకు సహాయ పడనుంది. క్షయ, మలేరియాతోపాటు పలు శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న రోగులకు ఈ ఉపకరణాలు ఎంతో మేలు చేస్తాయన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement