Saturday, November 23, 2024

ఇన్‌స్టాలో సరికొత్త ఫీచర్.. బ్రేక్ రిమైండ‌ర్‌తో కొత్త అప్‌డేట్..

దేశంతోపాటు విదేశాల్లోని యూజర్లకు ఇన్‌స్టాగ్రామ్ స‌రికొత్త ఫీచ‌ర్‌ని అందుబాటులోకి తెచ్చింది. టేక్ ఏ బ్రేక్ (Take a Break) పేరుతో లేటెస్ట్ అప్‌డేట్ తీసుకొచ్చిన‌ట్టు ఇన్‌స్టాగ్రామ్ తెలిపింది. ఇన్‌స్టాలో మునిగిపోయి ప్రపంచాన్నిమరిచిపోయే అలవాటు ఉన్న వారికి ఇది ఎంతో బెట‌ర్‌మెంట్ అని ఎక్స్‌ప‌ర్ట్‌లు చెబుతున్నారు. అమెరికా, బ్రిటన్, ఐర్లాండ్, కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాల్లో దాదాపు 2 నెలల నుంచి టెస్ట్ చేసిన తర్వాత ఎట్టకేలకు భారత్‌ సహా ఇత‌ర దేశాల్లో టేక్ ఏ బ్రేక్ ఫీచర్‌ను ప్ర‌వేశ‌పెట్టింది ఇన్‌స్టాగ్రామ్. ఇప్పటికే దాదాపు అన్ని ఐ ఫోన్‌లకు ఈ ఫీచర్ వచ్చేసింది. అయితే ఇప్పటికీ ఈ ఫీచర్ యాడ్ కానీ ఆండ్రాయిడ్ యూజ‌ర్ల‌కు త్వరలోనే రానుంది.

ముఖ్యంగా యువత కోసమే టేక్ ఏ బ్రేక్ ఫీచర్ తీసుకొచ్చినట్టు చెబుతోంది ఇన్‌స్టాగ్రామ్‌. నిర్ధిష్ట సమయం తర్వాత ఇన్‌స్టా నుంచి బ్రేక్ తీసుకునేందుకు టేక్ ఏ బ్రేక్ ఫీచర్ ఉపయోగపడుతుంద‌ని ఇన్‌స్టాగ్రామ్‌ పబ్లిక్ పాలసీ మేనేజర్ నటాశా జోగ్ తెలిపారు. ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్ర‌మేన‌ని, బ్రేక్ తీసుకోవాలని ఎంత సమయం తర్వాత రిమైండర్ రావాలన్నది యూజర్ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. 10 నిమిషాలు, 20 నిమిషాలు, 30 నిమిషాల కాల వ్యవధి ఈ ఫీచర్‌లో ఉంటుంది. సెట్ చేసుకునే టైమ్ ను బట్టి రిమైండర్ వస్తుంది.

టేక్ ఏ బ్రేక్ ఫీచర్ ఎలా సెట్ చేసుకోవాలంటే..

ముందుగా ఇన్‌స్టాగ్రామ్‌ యాప్‌ ఓపెన్ చేయాలి. ఆ తర్వాత కుడివైపు కింది భాగంలో ఉండే ప్రొఫైల్ పిక్చర్‌పై ట్యాప్ చేయాలి. అనంతరం పైకుడి భాగంలో మూడు లైన్లు కనిపిస్తాయి. దానిపై క్లిక్ చేసిన తర్వాత యువర్ యాక్టివిటీ ఆప్షన్ ఎంచుకోవాలి. యాక్టివిటీలో టైమ్ ట్యాబ్‌కు వెళ్లాలి. అక్కడే సెట్ రిమైండర్ టూ టేక్ బ్రేక్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి రిమైండర్ ఎంత సేపటికి రావాలో సెలెక్ట్ చేసుకోవాలి. ప్రస్తుతం ఐఫోన్ యూజర్ల‌కు Take a Break ఫీచర్ వచ్చింది. ఆండ్రాయిడ్ యూజ‌ర్ల‌కు మాత్రం త్వ‌ర‌లో ఈ అప్‌డేట్ అందిస్తామ‌ని ఇన్‌స్టాగ్రామ్ తెలిపింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement