1990ల్లో కశ్మీరీ పండిట్లపై జరిగిన అకృత్యాలు, హత్యాకాండలను ద కశ్మీర్ ఫైల్ చిత్రంలో చూపించారు. ఈ సినిమా అందరి నుంచి సినిమా ప్రశంసలను అందుకుంటోంది.సినిమా చూసిన ప్రేక్షకులు భావోద్వేగానికి గురవుతున్నారు. ఇప్పటికే ప్రధాని మోదీ నుండి.. బీజేపీ నాయకులెందరో ఈ చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇంకా ప్రముఖులెందరో ఈ చిత్రాన్ని పొగుడుతూనే ఉన్నారు. అంతేకాదు ఈ సినిమాకు కొన్ని రాష్ట్రాలు అయితే ఈ చిత్రానికి టాక్స్ బెనిఫిట్స్ కూడా ప్రకటించాయి. ఇలా అద్భుతమైన రెస్పాన్స్ తో దూసుకుపోతున్న ఈ చిత్రం ఓటిటి కి రెడీ అవుతున్నట్లు సమాచారం. ది కశ్మీర్ ఫైల్స్ చిత్ర డిజిటల్ రైట్స్‌ను జీ5 సంస్థ విడుదలకు ముందే సొంతం చేసుకుంది. మే నెలలో ది కశ్మీర్ ఫైల్స్ సినిమాను ఓటీటీలో విడుదల చేయాలని చిత్ర టీమ్ ప్లాన్ రూపొందిస్తున్నట్లు సమాచారం. మే 6న స్ట్రీమింగ్ అయ్యే అవకాశమున్నట్లు చిత్రవర్గాల ద్వారా తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయంపై అధికారిక సమాచారం వచ్చే అవకాశముంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..