మాతృత్వం అనేది జీవులకు ఎంతో అద్భుతమైన ఆనందాన్నిస్తుంది. ఆ సమయంలో ఎంతో అందంగానూ ఉంటాయి. ఇది ఒక మానవులలో మాత్రమే కాదండోయ్.. ప్రపంచంలోని ప్రతి జీవిలోనూ ఈ దశ ఎంతో కీలకంగా ఉంటుంది. ఇది వాటికి అతి ముఖ్యమైన క్షణం కూడా. ఈ సమయంలో జంతువుల శరీరంలో అనేక మార్పులు సంభవిస్తాయి. గర్భధారణ సమయంలో కొన్ని జంతువులు, పక్షులు ఎలా ఉంటాయో ఇక్కడ చూడొచ్చు.
– డిజిటల్ మీడియా, ఆంధ్రప్రభ
ఏనుగుల్లో అయితే.. అన్ని జంతువుల కంటే ఎక్కువ గర్భధారణ సమయం ఉంటుంది. జన్మనిచ్చే ముందు 18 నుండి 22 నెలల వరకు పిల్లలను అవి మోస్తాయి. చాలా తెలివైన జంతువులలో దీర్ఘకాల అభివృద్ధి జరుగుతుంది. ఏనుగులు ప్రపంచంలోనే అతిపెద్ద జీవిగా చెప్పుకోవచ్చు. ఇక.. నీటిలో ఉండే వాటిలో వాల్‌రస్‌లు కూడా ప్రత్యేకతను సంతరించుకుంటాయి(సముద్ర సింహాలు) ఎక్కువ కాలం గర్భధారణ వ్యవధిని కలిగి ఉండే వాటిలో వీటిది కూడా ప్రత్యేకతగానే చెప్పుకోవచ్చు.. వాటి పిల్లలను 15 నుండి 16 నెలల వరకు అవి గర్భంలోనే మోస్తాయి.