Friday, November 22, 2024

Breaking: నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచరం ఘటన కలచివేసింది.. శిక్షలు వేగంగా విధిస్తేనే బెటర్​: చిరంజీవి

హైదరాబాద్​ సిటీలోని బంజారాహిల్స్​ ప్రైవేట్​ స్కూల్లో జరిగిన ఓ ఇన్సిడెంట్​పై మెగాస్టార్​ చిరంజీవి ఇవ్వాల స్పందించారు. నాలుగేండ్ల పసిపాపై జరిగిన లైంగికదాడి ఘటన తనను ఎంతో కలిచివేసిందని ఆయన ట్వీట్​లో పేర్కొన్నారు. ఆటవిక సంస్కృతి నుంచి ఆనవాళ్లు మోసుకొస్తున్న కొందరు మృగాళ్ల వికృత చేష్టలకు కఠినమైన శిక్షలు వేగవంతంగా విధించడమే దీనికి పరిష్కారమన్నారు.

అన్ని ప్రభుత్వం పాఠశాలలు, ప్రైవేట్​ స్కూళ్లలో సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేసేలా ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని కోరారు చిరంజీవి. దీనికి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలన్నారు. భావితరాలకు భరోసా కల్పించడం మనందరి సమష్టి బాధ్యత అని చిరంజీవి గుర్తు చేశారు. ఈ చిన్నారికి జరిగిన అఘాయిత్యంపై చిరంజీవి రెస్పాండ్​ అయిన విషయం ఇప్పుడు ట్విట్టర్​లో పెద్ద ఎత్తున షేర్​ అవుతోంది. చాలామంది సీరియస్​ కామెంట్స్​ చేస్తున్నారు. ఇట్లాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement