నేటి మహిళలు అన్ని రంగాల్లో స్థిరపడుతున్నారు. కాగా ఈమె ప్రపంచంలోనే హాటెస్ట్ మెకానిక్ గా పేరుపొందింది. ఈ మహిళ పేరు టాంటిన్ లెగాస్పి మెనెసెస్. వయసు 26 సంవత్సరాలు. ఆమె 10 సంవత్సరాలుగా కార్లను రిపేర్ చేస్తోంది. 15 సంవత్సరాల వయస్సులో గ్యారేజ్‌లోకి ప్రవేశించింది.. ఆమె దగ్గర వాహనాలను రిపేర్ చేయించుకోవడానికి కస్టమర్లు క్యూ కడుతారు. కానీ ఇందులో చాలామంది ఆమెని చూడటానికే వస్తారు. టాంటిన్ సొంత గ్యారేజీని మెయింటెన్ చేస్తుంది. కార్ మెకానిక్‌గా పనిచేసేందుకు ఆటోమోటివ్ కోర్సు కూడా చేసింది. ఆమెకి ఈ వృత్తి అంటే చాలా ఇష్టం. టాంటిన్ కార్ మెకానిక్ మాత్రమే కాదు పార్ట్ టైమ్ మోడల్ కూడా. కార్లను ఫిక్సింగ్ చేయడంతో పాటు మోడలింగ్ వర్క్ కూడా బాగా చేస్తుంది. ఇక ఈ మోడల్ కార్లని రిపేర్ చేస్తుంటే ఆమెని చూడటానికి జనం ఎందుకు రారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement