Tuesday, November 26, 2024

సాయం చేసిన చేతులే దీనంగా ఆర్థిస్తున్నాయి.. భార్య పుస్తే మెట్టెలు అమ్మినా!

నలుగురికి సాయం చేసిన ఆ చేతులే ఇవ్వాల‌ ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నాయి. యువతకు విద్య కోసం సహాయ సహకారాలు అందజేసిన అత‌ను ఇప్పుడు నిస్స‌హాయుడిగా మిగిలిపోయాడు.. ఎంతో మందిని చదువుకునేలా ప్రోత్స‌హించిన త‌నకే ఇప్పుడు ఆదుకునే దిక్కు లేదు.. విధి వక్రీకరించి అనారోగ్యం పాలయ్యాడు.. లక్షల రూపాయలు ఖర్చు చేసినా ఆరోగ్యం కుదుటపడలేదు. దీంతో ఆరోగ్య ఖర్చుల కోసం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది ఆ కుటుంబం..

– మోతె, (ప్ర‌భ‌ న్యూస్)

సూర్యాపేట జిల్లా మోతె మండల కేంద్రానికి చెందిన గురిజాల మల్సూర్ లివర్ చెడిపోయింది. ఖమ్మంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. భర్త ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం అత‌ని భార్య పుస్తె మెట్టెలు కూడా అమ్మేసింది. దాంతోపాటు చేతిలో ఉన్న కొంత డబ్బు ఖర్చు పెట్టింది. రోజూకు 20 వేలకు పైగా వైద్యానికి ఖర్చవుతోంది. పేద కుటుంబం, చేతిలో చిల్లిగవ్వ లేక వారు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

పుస్తె మెట్టేలు అమ్మైనా భర్త కాపాడుకోవాలి అనుకున్న ఆ భార్య ఇప్పుడు.. త‌న భ‌ర్త ఆరోగ్యం కాపాడాల‌ని సాయం కోసం చేతులెత్తి వేడుకుంటోoది. పదిమంది మేలు కోరుకోనే మల్సూర్ కు తలా ఓ చేయి వేస్తే ఆ కుటుంబానికి ఆసరా ఉంటుంది. ప్రతి ఒక్కరు తోచిన సహాయం చేసి వారి కుటుంబానికి అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. పెద్ద మనస్సు చేసుకొని ప్రతి ఒక్కరూ ఆ కుటుంబానికి అండగా నిలవాలని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కోరుతున్నారు. మంచి మ‌న‌సున్న‌ దాత‌లు ఎవ‌రైనా స‌రే.. గురిజాల నాగరాణి, w/o గురిజాల మల్సూర్ 9848543402 ఫోన్ పే & గూగుల్ పే నంబర్ కు సాయం చేయ‌వ‌చ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement