Friday, November 22, 2024

కవిత పిటిషన్ పై విచారణ మూడు వారాలకు వాయిదా

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు పంపడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం విధితమే. ఇందుకు సంబంధించిన రిట్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. కవిత పిటిషన్‌ను జస్టిస్ అజయ్ రాస్తోగి, జస్టిస్ బేలా ఎం త్రివేది‌ల ద్విసభ్య ధర్మాసనం విచారించారు. కవిత తరపున లాయర్ కపిల్ సిబాల్ వాదనలు వినిపించారు. అయితే ఈడీ, కవిత లు లిఖిత పూర్వక వాదనలు సబ్మిట్ చేయాలని సుప్రీంకోర్టు తెలిపింది. అనంతరం తదుపరి విచారణను సుప్రీంకోర్టు మూడు వారాలకు వాయిదా వేసింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement