Tuesday, November 26, 2024

Big Breaking | రెండో విడత దళితబంధుకు ప్రభుత్వం రెడీ.. నియోజకవర్గానికి 1100 మందికి లబ్ధి

తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన దళిత బంధు పథకం ద్వారా దళితులు ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందుతున్నారు. దీనిపై ఇప్పటికే పలు రాష్ట్రాల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. తొలి విడతను సక్సెస్​ చేసిన తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు రెండో విడత లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభించింది. దీనికి సంబంధించిన జీవోని సీఎం కేసీఆర్​ ఆదేశాల మేరకు ఇవ్వాల (శనివారం) రాత్రి ప్రభుత్వం విడుదల చేసింది.

రెండో విడత దళిత బంధు పథకంలో లక్షా 30వేల కుటుంబాలకు లబ్ధి కలిగేలా చర్యలు తీసుకోనున్నారు. అంతేకాకుండా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 11‌‌00 మంది దళితులను ఎంపిక చేయనున్నట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement