Friday, November 22, 2024

ఒక్క ఆదివాసీ కుటుంబానికి 12 లక్షలతో నీళ్లు, తాగునీటి స‌ప్ల‌య్‌కి వెనుకాడని ప్రభుత్వం

అది ఆదివాసీలు నివాసం ఉండే రాష్ట్రంలోనే అత్యంత మారుమూల ప్రాంతం. అక్కడ కొండల్లో ఉన్నది ఒకే కుటుంబం. జనాభా ఆరుగురే. అలాగని, ప్రభుత్వం వారిని గాలికి వదిలేయ లేదు. కరెంట్‌ సౌకర్యం కల్పించింది. కేవలం వారి కోసమే రూ.12 లక్షల వెచ్చించి మిషన్‌ భగీరథ ట్యాంకు నిర్మించింది. రెండు నల్లాలు ఏర్పాటుచేసి దాహార్తిని తీరుస్తున్నది. కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా లింగాపూర్‌ మండలంలోని బబ్లుతండాలో నాలుగేండ్ల కిందటి వరకు ఐదు కుటుంబాలు నివాసం ఉండేవి.

వివిధ కారణాలతో నాలుగు కుటుంబాలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాయి. ఆత్రం భీం, అతని భార్య, కొడుకు, కోడలు వారి పిల్లలు మాత్రమే ప్రస్తుతం ఉంటున్నారు. ఈ కుటుంబం కోసమే ప్రభుత్వం మిషన్‌భగీరథ ట్యాంకు నిర్మించి స్వచ్ఛమైన నీటిని అందిస్తున్నది. కొండలు, గుట్టల మీదుగా పైపలైన్లు వేసి తాగునీరు అందిస్తుండటం ప్రభుత్వ పట్టుదలకు నిదర్శనంగా నిలుస్తున్నది. తెలంగాణ ప్ర‌జ‌ల‌కు తాగునీరు అందించాల‌ని భ‌గీర‌థ ప్ర‌య‌త్నాలు చేస్తున్న సీఎం కేసీఆర్ ప‌ట్టుద‌ల‌, చొర‌వ‌పై పెద్ద ఎత్తున ప్ర‌శంస‌లు వెల్ల‌వెత్తుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement