మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. లాక్‌డౌన్ సమయంలో విద్యార్థులు, పౌరులపై నమోదు అయిన కేసులన్నీ ఎత్తేయనున్నట్టు ప్రకటించింది. కరోనా సమయంలో రెండేళ్లలో నమోదు అయిన కేసులను రద్దు చేసేందుకు తమ ప్రభుత్వం నిర్ణయించినట్లు హోంమంత్రి దిలీప్ వాల్సే పాటిల్ తెలిపారు. ఐపీసీ 188 సెక్షన్ కింద చాలా కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్ర కేబినెట్ ముందు త్వరలో ఈ ప్రతిపాదన చేయనున్నట్లు ఆయన చెప్పారు. కేబినెట్ ఆమోదించిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా నమోదు అయిన అన్ని కేసులను ఎత్తివేస్తామని మంత్రి పాటిల్ తెలిపారు. లాక్‌డౌన్ కర్ఫ్యూ వేళల్లో తిరగడం, గ్రూపులుగా ఉండడం, పబ్లిక్ ప్రదేశాల్లో తిరుగుతున్న వారిపై వేలాదిగా కేసులను బుక్ చేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement