హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ పబ్ వద్ద కారులో మైనర్ బాలికను తీసుకెళ్లి గ్యాంగ్ రేప్ చేసిన కేసుకు సంబంధించిన వివరాలను హైదరాబాద్ సిటీ సీపీ సీవీ ఆనంద్ మీడియాకు వెల్లడించారు. ఆ కేసులో అసలేం జరిగిందనే వివరాలను తెలియజేశారు. ఈ కేసులో ఆరుగురు నిందితులున్నారని, వారందరిపై గ్యాంగ్ రేప్, ఫోక్సో వంటి చట్టాల కింద కేసు నమోదు చేశామన్నారు. కాగా, కేసులో నిందితులంతా మైనర్లే ఉన్నారు కాబట్టి వారి వివరాలు వెల్లడించడం కుదరదన్నారు. అయితే ఒకరు మేజర్, మిగతా ఐదుగురు మైనర్లేనని తెలిపారు సీపీ ఆనంద్.
కాగా, బెంగళూరులో నివసించే వ్యక్తి ఒకతను ఇక్కడ పార్టీకి ప్లాన్ చేశాడని. ఉస్మాన్ అలీఖాన్ అనే వ్యక్తి ద్వారా పబ్ బుక్ అయ్యినట్టు చెప్పారు. 28వ తేదీ మధ్యాహ్నం ఒంటిగంటకి పబ్కి బాధితురాలు వచ్చిందని, ఆరోజు ఘటన జరిగితే 31వరకు బయటకు చెప్పలేదని తెలిపారు. అయితే ఆ తర్వాత జరిగిన వరుస పరిణామాలు, నిందితుల గురించి వివరాలు సేకరించడం, సీసీ టీవీ ఫుటేజీ పరిశీలన తర్వాత ఈ కేసులో ఆరుగురు నిందితుల్ని అరెస్టు చేసినట్టు చెప్పారు. ఇందులో ఒకరి వయసు 18 సంత్సరాలకు ఒక నెల తక్కువగానే ఉందని తెలిపారు సీపీ ఆనంద్. అయితే.. బాధితురాలు ఆ రోజు 1300 ఎంట్రీ ఫీజు కట్టి పబ్కి వచ్చినట్టు తమ పరిశీలనలో వెల్లడైందన్నారు. నిందులందరికీ ఈ కేసులో 20 సంవత్సరాల జైలు, లైఫ్ శిక్ష లేదా మరణశిక్ష కూడా పడొచ్చు.. అట్లాంటి కేసులు నమోదు చేసినట్టు తెలిపారు.
బాధితురాలు నిందితులను గుర్తించలేకపోతోందని, అనేక కోణాల్లో విచారణ జరపాల్సి ఉంది కాబట్టే కేసు ఆలస్యమైందన్నారు సీపీ సీవీ ఆనంద్. తమ దగ్గర నిందితులకు సంబంధించిన బలమైన ఆధారాలున్నాయన్నారు. పబ్ దగ్గర నుంచి కారులో ఎక్కించుకుని పెద్దమ్మ టెంపుల్ వెనకాల ఆపి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డట్టు తెలిపారు. అయితే.. ఆ మైనర్పై అయిదుగురు రేప్ చేసినట్టు తమ విచారణలో వెల్లడైందన్నారు. ప్రతి చిన్న విషయాన్ని డబుల్ వెరిఫికేషన్ చేయాల్సి వచ్చిందని, కేసును పకడ్బందీగా పెట్టడానికే సమయం పట్టిందన్నారు. ఆధారాలు లేకుండా కేసు బుక్ చేయలమని చెప్పుకొచ్చారు సీపీ ఆనంద్.
ఇదీ జరిగింది.. బాలికను చూసి ప్లాన్ చేసుకున్నారు..
మధ్యాహ్నం 1గంటకే పబ్కి వచ్చిన బాలిక.. ఆ రోజు 3 గంటల తర్వాత ఆరుగురు ఫ్రెండ్స్ ఆ పబ్కి చేరుకున్నారు. ఆ అమ్మాయిని చూసి వాళ్లు ప్లాన్ చేసుకున్నారు. 3.15కి బాలికతో అసభ్యంగా మాట్లాడారు. బాధితురాలికి అక్కడే తారసపడిన స్నేహితురాలు. అప్పటి నుంచి 5.40 దాకా ఆ అమ్మాయిని వేధించారు. ఆ తర్వాత పబ్ నుంచి ఆమె ఫ్రెండ్ బయటకు వెళ్లిపోయింది. ఆ తర్వాత ఇన్నోవా కారులో ఆ బాలికను తీసుకెళ్లారు. కారులోనే నలుగురు బలవంతంగా ముద్దుపెట్టుకున్నారు. బాధితురాలితో సహా కారులో మొత్తం ఆరుగున్నారు. ఆ తర్వాత బెంజ్ కారులో నుంచి ఇన్నావాలోకి మారిన బాలిక. రోడ్కే నెంబర్సు 44లో చీకటి ప్రాంతంలో గ్యాంగ్ రేప్ చేశారు. బాలిక ఫోన్ కాల్తో 7.53కి ఆమె తండ్రి వచ్చి తీసుకెళ్లాడు. 1గా సాదుద్దీన్ మాలిక్,