Thursday, November 21, 2024

జంట జ‌లాశ‌యాల‌కు పోటెత్తిన వరద.. హిమాయత్ సాగర్ రెండు గేట్లు ఓపెన్​..

(ప్రభ న్యూస్ బ్యూరో ఉమ్మడి రంగారెడ్డి) : హైద‌రాబాద్‌కు తాగునీరు అందించే జంట జ‌లాశ‌యాల‌కు భారీగా నీరు వ‌స్తోంది. రెండు, మూడు రోజులుగా కురుస్తున్న వాన‌ల‌కు ఉస్మాన్ సాగర్ , హిమాయత్ సాగర్ చెరువులకు భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో జలమండలి అధికారులు హిమాయత్ సాగర్ రెండు గేట్లను ఎత్తి ఇవ్వాల (ఆదివారం) నీటిని దిగువ ప్రాంతానికి వదిలారు. హిమాయత్ సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1763 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 1761 అడుగులకు చేరడంతో గేట్లను ఎత్తినట్లు అధికారులు తెలిపారు.

డ్యామ్ నిర్మాణం చేపట్టి వంద ఏళ్లు గడిచిన నేపథ్యంలో పూర్తిగా నిండగా ముందే గేట్లను ఎత్తినట్లు జ‌ల‌మండ‌లి అధికారులు పేర్కొన్నారు. విరామం లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. దీంతో జంట జలాశయాలకు వరద నీళ్లు చేరుతున్నాయి. అందులో భాగంగానే హిమాయత్ సాగర్ జలాశయం లో రెండు గేట్లు ఎత్తివేసి దిగువ ప్రాంతాల‌కు నీటిని వ‌దిలిన‌ట్టు అధికారులు తెలిపారు. దీంతో పాటు దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement