Friday, November 22, 2024

పంది గుండె మార్పిడి చేసుకున్న తొలి వ్య‌క్తి మృతి

మానవ చరిత్రలో తొలిసారి పంది గుండె మార్పిడి చేయించుకున్న వ్యక్తి, రెండు నెలల తర్వాత మరణించారు. ఆయనకు ఈ సర్జరీ చేసిన అమెరికాలోని మేరీల్యాండ్ యూనివర్సిటీ ఆసుపత్రి ఈ మేరకు ప్రకటించింది. అయితే ఆయన మరణానికి దారి తీసిన కారణాలను వెల్లడించలేదు. 57 ఏండ్ల డేవిడ్ బెన్నెట్‌ కొన్నేండ్లుగా గుండె సంబంధ సమస్యతో బాధపడుతున్నారు. ఆయనకు గుండె ట్రాన్స్‌ప్లాంట్‌ చేయాల్సిన అవసరం ఏర్పడింది. అయితే మానవ గుండె దాత లభించలేదు. దీంతో జీన్ ఎడిటింగ్‌, క్లోనింగ్ విధానంలో అభివృద్ధి చేసిన పంది గుండెను ఆయనకు అమర్చాలని మేరీల్యాండ్ యూనివర్సిటీ ఆసుపత్రి వైద్యలు నిర్ణయించారు.

అయితే ఆ ఆశ ఆవిరయ్యింది. డేవిడ్ బెన్నెట్‌ ఆరోగ్యం గత కొన్ని రోజులుగా క్షీణిస్తున్నదని మేరీల్యాండ్ యూనివర్సిటీ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో పంది గుండె మార్పిడి సర్జరీ జరిగిన రెండు నెలల తర్వాత మంగళవారం ఆయన చనిపోయినట్లు ప్రకటించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement