దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఇప్పటికే ఒమిక్రాన్ 90కి పైగా దేశాల్లో విస్తరించింది. యూరోపియన్ దేశాలను కొత్త వేరియంట్ అతలాకుతలం చేస్తోంది. ఒమిక్రాన్ దెబ్బకు యూరప్ లోని పలు దేశాలు ఇప్పటికే లాక్ డౌన్ ప్రకటించాయి. అగ్రరాజ్యం అమెరికాపై కూడా ఒమిక్రాన్ తన ప్రభావాన్ని చూపిస్తోంది. అమెరికాలో ఒమిక్రాన్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. కేవలం ఒక వారం వ్యవధిలోనే కేసుల సంఖ్య 3 శాతం నుంచి 73 శాతానికి పెరిగింది. తాజాగా అమెరికాలో ఒమిక్రాన్ తో తొలి మరణం సంభవించింది. టెక్సాస్ లో ఒమిక్రాన్ బాధితుడు మరణించినట్లు అధికారులు కూడా ధ్రువీకరించారు.
యూకేలో ఇప్పటి వరకు 12 మంది ఓమిక్రాన్ మరణాలు సంభవించాయి. తాజాగా అమెరికాలో మరో మరణంతో మరణాల సంఖ్య 13కు చేరింది. ఒమిక్రాన్ కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. దేశంలో కేసులు పెరుగుతున్న లాక్ డౌన్ పై అధ్యక్షుడు జో బిడెన్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ప్రెస్ సెక్రటరీ జెన్ ప్సాకి చెప్పారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital