ఏపీలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదయింది. ఓమిక్రాన్ కేసుగా వైద్యారోగ్యశాఖ ధృవీకరించింది. విజయనగరానికి చెందిన వ్యక్తిగా అధికారులు గుర్తించారు. ఒమిక్రాన్ పాజిటివ్ వచ్చిన వ్యక్తి వయస్సు 34 సంవత్సరాలు ఉంటుందని వైద్యులు తెలిపారు. ఆ వ్యక్తి గత నెల 27 వ తేదీన విశాఖ పట్నానికి వచ్చాడని.. దీంతో ఒమిక్రాన్ పరీక్షలు నిర్వహించారు అధికారులు. అయితే.. ఆ రిపోర్ట్ నేడు రావడంతో… అందుతో అతనికి ఒమిక్రాన్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో అతనికి వైద్య పరీక్షలు అందిస్తున్నారు . ఇక ఇటీవల ఏపీకి మరో 15 మంది విదేశీయులు వచ్చారని.. వారికి ఒమిక్రాన్ పరీక్షలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కేసుతో దేశ వ్యాప్తంగా.. 34 కు చేరాయి ఒమిక్రాన్ కేసులు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని.. మాస్క్ లను తప్పనిసరిగా వాడాలని తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..