Tuesday, November 26, 2024

Liquor Allergy | దేశంలో మొదటి లిక్కర్ అలర్జీ కేసు.. మెడికల్​ టెస్టుల్లో తేలిందేంటంటే!

ఆగ్రా ప్రాంతానికి చెందిన జాన్ (36).. తన మిత్రులతో కలిసి రిసార్ట్ కి వెళ్లి పార్టీలో పాల్గొన్నాడు. కబుర్ల అనంతరం అందరూ కలిసి మద్యాన్ని తాగారు. అందరితో పాటు తన గ్లాస్ లో ఉన్నా మద్యాన్ని తాగిన జాన్, సరిగ్గా పదిహేను నిమిషాల తర్వాత త‌న‌లో శారీరికమైన మార్పులు కనుక్కున్నాడు. అత‌ని ముఖమంతా ఎర్రబడింది. ముఖం వేడిగా మారడం, చర్మంపై దురదలు రావడం.. ఛాతి బరువుగా ఉండడం.. పట్టేసినట్టు, ఆయాసంగా అనిపించడం.. మైకం వ‌లే రావడం.. తల దిమ్ముగా ఉండడం వంటి ల‌క్ష‌ణాలు క‌నిపించాయి.

ఈ పరిస్థితి గమనించి అప్రమత్తమైన అత‌ని మిత్రులు.. తనని  సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రి చేరేసరికి కొద్దిగా జాన్ పరిస్థితి విషమించింది. వెంటనే చికిత్స అందించిన వైద్యులు, 12 గంటల తర్వాత చికిత్సకు జాన్ ఆరోగ్యం మెరుగుపడడం మొదలైంది. ఇదిలా ఉండగా సరిగ్గా రెండు నెలల అనంతరం, మిత్రులతో జరిగిన ఓ విందులో పాల్గొన్న జాన్, మద్యం తాగి, మళ్లీ ఇదే పరిస్థితి ఎదుర్కొన్నాడు.

అసలేం జరుగుతోంది?.. తన పరిస్థితి ఎందుకిలా విషమిస్తుంది? ఇలాంటి ఇబ్బందులు- ప్రాణాపాయ స్థితి ఎందుకు వస్తుంది?? దీనిపై ఢిల్లీలోని వివిధ  వైద్య‌ నిష్ణాతుల దగ్గరికి సలహాలపై, వివిధ వైద్య పరీక్షలు నిర్వహించడం మొదలుపెట్టాడు. ఎంత పరీక్షించిన అంతుచిక్కని పరిస్థితులతో, అయోమయంలో పడ్డాడు జాన్.

- Advertisement -

హైదరాబాదులోని అశ్విని ఎనర్జీ సెంటర్ 1800-425-0095 జాతీయ ఎలర్జీ టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ కి ఫోన్ చేసి, తన గోడును వెలిబుచ్చారు. దీనికి స్పందించిన డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్, సుమారు గంట సేపు మాట్లాడి, జాన్ ఆరోగ్యవివరాలు సేకరించారు అలర్జీ సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్. డాక్టర్ వ్యాకరణం నాగేశ్వరావు సలహామేరకు ఆగ్రా నుండి, జాన్ తను అలవాటు ప్రకారం తీసుకుంటున్నా మద్యం సీసాతో సహా హైదరాబాదుకు చేరారు.

ప్రాథమిక పరీక్షలు నిర్ధారణ అనంతరం జాన్​కి అలర్జీ మార్పులున్నాయని డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్ తెలుసుకున్నారు.. 1) రక్తంలో serum Ig E: 950IU.. 2) ఊపిరితిత్తుల కంప్యూటర్ పరీక్షలో ఆస్తమా నిర్ధారణ. 3) వంశపారపర్యంగా తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఎలర్జీ మార్పులు.. 4) సరిగ్గా ఇలాంటి పరిస్థితి, ఆరు సంవత్సరాల క్రితం ఎదుర్కొన్నా జాన్.

వీటన్నిటిని పరిగణలోకి తీసుకున్న డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్,80 అలర్జీ పరీక్షలు (45 food allergens + 35 environment allergens) జాన్ ఆగ్రా నుండి వచ్చేటప్పుడు, తన వెంట తెచ్చుకున్న మద్యం బాటిల్ లోని మద్యాన్ని 1ml సేకరించి అత్యాధునికమైన అలర్జీ స్కిన్ టెస్టింగ్ చేశారు.  జాన్ కీ అతి అరుదైన ఆల్కహాల్ ఓరాళ్ల ఛాలెంజర్ టెస్ట్ (Alcohol oral Challenge Test) నిర్వహించిన అనంతరం, ఆల్కహాల్ కి ఎలర్జీ ఉన్నట్టు నిర్ధారణ అయినట్లు డాక్టర్ వ్యాకరణం తెలిపారు.

ఆల్కహాల్ అలర్జీ పై డాక్టర్ వ్యాకరణం వివరణ ఇస్తూ, సాధారణంగా కేవలం మద్యం పదార్థానికి ఎలర్జీ ఉండడమే కాదు, మద్యం సేవించే టప్పుడు స్నాక్స్ ( చిరుతిండ్లు) తినడం అలవాటు ఉంటుంది. మద్యము తోపాటు సేవించే ఈ తిండి పదార్థాల్లో సాధారణంగా, నూనెలో వేయించి మసాలా పల్లీలు, బఠానీలు, మసాలా ఫుడ్ ఐటమ్స్, చికెన్ రోస్ట్, మటన్ రోస్ట్, తదితర పదార్థాలు తింటుంటారు. ఇటువంటి పదార్థాలను హై హిస్టమిన్ ఫుడ్ గా వైద్యపరంగా పరిగణిస్తాం= అనగా, ఎలర్జీతో బాధపడేవారు ఇటువంటి పదార్థాలు తరచుగా తిన్నట్లైతే, శరీరములోని ఎలర్జీలను పెంచి, రక్తములోని హీష్టమైన (Histamine) రసాయన పదార్థం విపరీతంగా పెరిగి, ఫలితముగా ఇబ్బందులు పెట్రేగి భయంకరమైన ఎలర్జీలకు దారితీస్తాయి.

ఆల్కహాల్ ఎలర్జీ వారికి సలహాలు!!

1) ఆల్కహాల్ ఎలర్జీ నిర్ధారణ అయిన అనంతరం, వారికి నిర్ధారణ అయిన మద్యం, శాశ్వతముగా వదలవలసి ఉంటుంది.

2) అవసరమైతే ఆ మద్యం బ్రాండ్ లోని మద్యం విపరీతముగా డైల్యూట్/ పలచన చేసి తాగ వలసింది ఉంటుంది.

3) ఎట్టి పరిస్థితుల్లో హై హిస్టమిన్ ఫుడ్, ఆల్కహాల్ సేవించే టప్పుడు స్వీకరించకూడదు.

4) ఆల్కహాల్ సేవించే వారు!! ఆల్కహాల్ ఎలర్జీ నిర్ధారణ అనంతరం, వైద్య కారణాల కొరకు/ మెరుగైన ఆరోగ్యము కొరకు, ఒక ఆరు నెలలు!! మద్యం సేవించడాన్ని దూరం పెట్టడం మంచిది!!

5) ఆల్కహాల్ సేవించే 30mins ముందు, ఓ రకమైన antihistamine మందులు, వైద్యుల సలహా మేరకు, తీసుకుంటే మంచిది.

6) ఉబ్బసం /ఆయాసం /ఆస్తమా వంటి రోగాలతో బాధపడుతున్న వారు మద్యం సేవించే 30mins ముందు, తప్పనిసరిగా వైద్య సలహా మేరకు చతి మోస గొట్టాల్లో వాడే ఇన్హేలర్ (inhalers) లు వాడవలసి ఉంటుంది.

జాన్ కు అలర్జిక్ అర్టికేరియా ( చర్మంపై దురదలు), అలర్జిక్ ఆస్తమా, ఆల్కహాల్ ఎలర్జీ ఉన్నట్టు డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్ నిర్ధారణ చేశారు. అశ్రద్ధ చేసినట్లయితే కొంతమందిలో ప్రాణాపాయ స్థితి అలర్జిక్ ఆంజియో ఎడిమా ( పెదవుల వాయడం, ముఖం వాయటం, చేతులు వేయడం, మైకము రావడం), అలర్జీ అనఫైలక్స్ఎస్ ( కళ్ళు తిరగడం, శ్వాస ఇబ్బందిగా ఉండటం , చాతి బరువుగా ఉండటం, స్పృహ కోల్పోవడం) ఎదుర్కొనే అవకాశం లేకపోలేదని డాక్టర్ వ్యాకరణం వెల్లడించారు.

జాన్ బాధపడుతున్న ఆల్కహాల్ ఎలర్జీ పరిస్థితిని అధిగమించడానికి, అత్యాధునికమైన అలర్జీ చికిత్స విధానంలో ఒకటైన immunotherapy చికిత్స కొరకై, ఇట్టి అరుదైన వైద్య పరిస్థితుల్లో ఆల్కహాల్ sublingual  ఇమ్మ్యునో థెరపీ అందించటానికి సాధ్యాఆసాధ్యాలపై డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్ ప్రపంచ స్థాయి అలర్జీ వైద్య నిష్ణాతుల తో సంప్రదిస్తున్నారు. ఇది గనక సాధ్యమైతే ( Alcohol specific sub – lingual Immunotherapy) ఆల్కహాల్  స్పెసిఫిక్ సబ్ lingual ఇమ్మ్యునో థెరపీ ఇచ్చే అవకాశం ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement