Friday, November 22, 2024

ఎంబీబీఎస్‌లో సీటొచ్చినా ఫీజు క‌ట్ట‌లేని స్థితిలో కుటుంబం.. సాయం కోసం ఎదురుచూస్తున్న స్టూడెంట్‌

చందన.. గిరిజన విద్యార్థిని.. బాగా చదువుకుని తన కల నెరవేర్చుకోవాలనుకుంది. ఎంతో కష్టపడింది. తన కష్టానికి ఫలితం కోసం ఎదురుచూసింది. నిట్‌లో గెలిచింది. ఎంబీబీఎస్‌లో సీటు లభించింది. ఆ కాలేజీలో చేరాలంటే.. అడ్మిషన్‌కు అవసరమైన ఆర్థిక స్థోమత కుటుంబానికి లేకుండా పోయింది. తండ్రి ప్రస్తుతం ఆటో డ్రైవర్‌..తల్లి గృహిణి.. తన చదువుకు అవసరమైనంత రాబడి లేని బతుకులు. అందుకే సహృదయంతో స్పందించే వారి కోసం ఆ కుటుంబం ఎదురుచూస్తోంది. మానవత్వంతో ఆదుకునే మనుషుల సాయం కోరుతోంది.

(ప్రభన్యూస్‌, సూర్యాపేట కలెక్టరేట్‌) : సూర్యాపేట పట్టణంలోని జాకీర్‌ హుస్సేన్‌ నగర్‌ కాలనీకి చెందిన బానోతు రెడ్డియా, అనసూర్య దంపతులకు ఇద్దరు కుమార్తెలు. రెడ్డియా గతంలో ఆర్టీసీ డ్రైవర్‌గా పనిచేసి ఆరేళ్ల క్రితమే పదవీ విరమణ చేశాడు. ఉన్నంతలో ఇద్దరు కుమార్తెలను చదివించి పెద్ద కుమార్తెకు ఇటీ-వలే పెళ్లి కూడా చేశారు. రెండో కుమార్తె బానోతు చందనను తనకున్న అంతలో చదివించగా నీట్‌లో బీ క్యాటగిరీలో సిద్దిపేటలోని సురభి ఇనిస్టిట్యూషన్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌ కళాశాలలో సీటు- వచ్చింది. ఈ నెల 17 లోపు నలభై వేలు చెల్లించి కళాశాలలో జాయిన్‌ కావాల్సి ఉంది. ఇక ట్యూషన్‌ ఫీజు 11,55,000, కళాశాల ఫీజు 60,000 మొత్తం 12,15,000 కళాశాలకు చెల్లించాల్సి ఉంది. పేద కుటు-ంబంలో పుట్టిన గిరిజన విద్యార్థినికి కళాశాల ఫీజు చెల్లించుకునే ఆర్థిక స్థోమత లే పోవడంతో కుటుంబం దిగులు చెందుతోంది.

తన ప్రయత్నాలతో రూ. 60 వేలు సమకూర్చుకున్నట్టు తండ్రి రెడ్డియా తెలిపారు. పన్నెండు లక్ష రూపాయలకు చెల్లించడం తమకు తలకు మించిన పనేనని వాపోతున్నారు. దాతలు స్పందించి తమ కూతురు వైద్య విద్యకు ఆర్థిక సహకారం అందించాలని కోరుతున్నారు. కాగా చందన పదవ తరగతిలో సూర్యాపేటలోని న్యూ మిలీనియం ఉన్నత పాఠశాలలో 8.8 శాతం మార్కులతో, ఇంటర్‌ మీడియట్‌ ను సూర్యాపేటలోని గాయత్రి జూనియర్‌ కళాశాలలో 946మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. నీట్‌ కోసం ఖమ్మంలోని ఆకాశ్‌ కోచింగ్‌ సెంటర్‌ లో కోచింగ్‌ తీసుకొని ఇటీవల జరిగిన నీట్‌ పరీక్ష (హాల్‌ టికెట్‌ నెం 4223030125)కు హాజరైంది.

- Advertisement -

నీట్‌ లో 2,88,775 ర్యాంకు సాధించి ఎస్‌టి భాగంలో సిద్దిపేట జిల్లాలో సీటును దక్కించుకుంది. దాతలు స్పందించి తన వైద్యవిద్యకు సహకరించాలని కోరుతోంది. దయచూపే వారు ఎస్‌బీఐ ఖాతా నెం 34759665416, సిఐఎఫ్‌ నెం 88293743912, ఐఎఫ్‌ఎస్‌సినెం ఎస్‌బిఐఎన్‌ 0006316 కు ఆర్థిక సహకారం అందించాలని కోరుతున్నారు. 6302906967 ఫోన్‌ నెంబర్‌కు సమాచారమిచ్చినా తామే వచ్చి కలుస్తామని తల్లిదండ్రులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement