గుప్తా బిల్డర్స్‌పై చంఢీఘడ్‌లో మనీల్యాండరింగ్ కేసు నమోదైంది. దీంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) గుప్తా బిల్డర్స్ అండ్ ప్రమోటర్స్ సంస్థపై సోదాలు నిర్వహించింది. సుమారు 19చోట్ల తనిఖీలు జరుగుతున్నాయి. చండీఘడ్, అంబాలా, పంచకుల, మొహాలీ, ఢిల్లీలో ఉన్న గుప్తా బిల్డర్స్ ఆఫీసుల్లో సోదాలు జరిగాయి. మనీల్యాండరింగ్ కేసులో ఆ సంస్థ డైరక్టర్లను ఈడీ విచారిస్తోంది. ఈ సోదాల్లో భారీ స్థాయిలో డాక్యుమెంట్లను, సుమారు 85 లక్షల నగదు, ఆడి కూ7 కారును స్వాధీనం చేసుకున్నారు.గుప్తా బిల్డర్స్‌పై చంఢీఘడ్‌లో మనీల్యాండరింగ్ కేసు నమోదు అయ్యింది. సుమారు 325 కోట్ల మేర మోసం జరిగినట్లు ఈడీ గుర్తించింది. ఇండ్లు కొనుగోలు చేసేవారిని, ఇన్వెస్టర్లను మోసం చేశారని, వారికి ఇస్తానన్న ఫ్లాట్లు, ప్లాట్లు, కమర్షియల్ భవనాలను ఇవ్వలేదని ఆరోపణలున్నాయి.
Advertisement
తాజా వార్తలు
Advertisement